పెన్షనర్లకు చంద్రబాబు భారీ ఊరట.. అడిషనల్ క్వాంటం పెన్షన్ పునరుద్ధరణ.. ఉద్యోగులకు కీలక హామీలు
- గత ప్రభుత్వం రద్దు చేసిన అడిషనల్ క్వాంటం పెన్షన్ పునరుద్ధరణ
- 12వ పీఆర్సీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం
- పెండింగులో ఉన్న రెండు డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్
- ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం వెల్లడి
- ప్రభుత్వ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాల నేతలు
రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ ఊరట కల్పించారు. గత ప్రభుత్వం రద్దు చేసిన ‘అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్’ను పునరుద్ధరిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలతో శనివారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. దీనితో పాటు ఉద్యోగులు ఎదురుచూస్తున్న పలు పెండింగ్ సమస్యల పరిష్కారానికి కూడా ముఖ్యమంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నేతలతో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూనే, ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.
వచ్చే ఏడాది జనవరి నుంచి పెన్షనర్లకు అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం, 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు 10 శాతం, 75 ఏళ్లు దాటిన వారికి 15 శాతం అదనపు పెన్షన్ అందనుంది. ఉద్యోగుల చిరకాల డిమాండ్ అయిన 12వ పే-రివిజన్ కమిషన్ (పీఆర్సీ) ఏర్పాటుకు కూడా సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. అలాగే, పెండింగ్‌లో ఉన్న 4 డీఏలలో రెండింటిని విడుదల చేయడానికి అంగీకరించారు. 1-7-2024, 1-1-2025 తేదీలకు చెందిన ఈ రెండు డీఏలను 2026 అక్టోబర్ 1 నుంచి చెల్లించనున్నారు.
2022 సంవత్సరానికి సంబంధించిన సరెండర్ లీవుల మొత్తాన్ని వచ్చే సంక్రాంతికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసులకు ఒక అదనపు సరెండర్ లీవ్‌ను ఈ దసరాకే చెల్లించేందుకు సుముఖత చూపారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్)ను క్రమబద్ధీకరించి, వచ్చే నెల నుంచే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌కు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.2,880 కోట్ల అదనపు భారం పడనుంది.
గత పాలనలో ఉద్యోగులకు అవమానాలు: సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, "మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా... గత రెండేళ్ల కాలంలో ఒకటో తేదీన క్రమం తప్పకుండా జీతాలు ఇస్తున్నాం.. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇస్తున్నాం. 11 వేల మంది సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ వర్తింపచేశాం. ఉద్యోగులకు సంబంధించి ఉన్న పెండింగ్ బిల్లుల్లో ఇప్పటి వరకు రూ.30,849 కోట్లు క్లియర్ చేశాం.
గత ప్రభుత్వం ఇష్టానుసారంగా వడ్డీలకు అప్పులు తెచ్చింది. ఆర్థిక సంస్థలతో చర్చించి రూ.1.50 లక్షల కోట్ల మేర అప్పులపై భారీగా ఉన్న వడ్డీలను రీ షెడ్యూల్ చేసి తగ్గించుకోగలిగాం. ప్రస్తుతం సరాసరి 9.1 శాతం వడ్డీని ప్రభుత్వం అప్పులపై చెల్లిస్తోంది. ఈ భారాన్ని ఇంకా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం. విధ్వంసమైన వ్యవస్థలను నెమ్మదిగా గాడిన పెడుతున్నాం. గత పాలకులు ఉద్యోగులను దగ్గరకే రానీయలేదు. రివర్స్ పీఆర్సీ ఇచ్చారు... అలాంటి పరిస్థితులు ఉద్యోగులు మరిచిపోవద్దు.
గత ప్రభుత్వం రిటైరైన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్‌ను కూడా పెండింగులో పెట్టింది. ఉద్యోగులను అవమానించేలా వాలంటరీలతో కరపత్రాలు పంపిణీ చేయించారు.. హోర్డింగులు పెట్టించారు... పేపర్లో ప్రకటనలు ఇచ్చారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మధ్యవర్తులతోనే మాట్లాడే పరిస్థితి నాడు ఉండేది. సమస్యల పరిష్కారం కోసం నాటి సీఎం కాళ్లు పట్టుకోవాలని అప్పుడు మంత్రులుగా ఉన్న వారు కామెంట్లు చేశారు... అవమానించారు. మంచికి చెడుకు ఉన్న వ్యత్యాసాన్ని ఉద్యోగులందరూ గుర్తించాలి. మేం ఉద్యోగులను గౌరవిస్తున్నాం... సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో ఉన్నాం.
రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బందులు పడకూడదని వారి సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిచ్చాం. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ సానుకూలంగా ఉంటాం. ఆర్థిక వెసులుబాటు ఉంటే ఉద్యోగులకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. 2014లో నాడు విభజన తర్వాత ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద పీట వేశాం. విభజనకు వ్యతిరేకంగా పోరాడింది ఉద్యోగులే. వారిని గౌరవించాలని.. ఇబ్బందులు వస్తాయని తెలిసినా... 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చాం. ఉద్యోగులు వారి సమస్యల గురించి.. యూనియన్ల కోసం పని చేస్తారు. నేను రాష్ట్రం కోసం... ప్రజల కోసం ఆలోచించాలి. ఇందులో ఉద్యోగులూ భాగమే”అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.