విజయవాడలో అట్టహాసంగా గురుపూజోత్సవం.. 175 మంది ఉత్తమ గురువులకు చంద్రబాబు, లోకేశ్ సత్కారం
- నేడు ఉపాధ్యాయ దినోత్సవం
- విజయవాడలో కార్యక్రమం
- హాజరైన సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
- 175 మంది ఉత్తమ గురువులకు పురస్కారాలు అందజేత
- ఉపాధ్యాయులను సత్కరించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
- ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం గురుపూజోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది. విజయవాడలోని ఏ-కన్వెన్షన్ సెంటర్‌లో మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుక పండుగ వాతావరణంలో సాగింది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథులుగా హాజరై, రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 175 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులను ఘనంగా సత్కరించారు.
కార్యక్రమం ప్రారంభానికి ముందు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల అభిప్రాయాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక వాల్ బోర్డులను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఆసక్తిగా తిలకించి, పలు సూచనలు చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ విద్యా విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన 175 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా సత్కరించారు. పాఠశాల విద్య నుంచి 79 మంది, ఇంటర్మీడియట్ నుంచి 24, సాంకేతిక విద్య నుంచి 14, విశ్వవిద్యాలయాల నుంచి 35 మంది, కళాశాల విద్య నుంచి 17 మంది, ఇంజనీరింగ్, ఫార్మసీ విభాగాల నుంచి ఆరుగురికి ఈ పురస్కారాలు దక్కాయి. అవార్డు గ్రహీతలను శాలువాతో సత్కరించి, ప్రశంసాపత్రం, మెడల్, జ్ఞాపికతో పాటు రూ.20 వేల నగదు బహుమతిని సీఎం, మంత్రి అందజేశారు.
వేడుకలో భాగంగా ఇద్దరు ఉపాధ్యాయులకు అరుదైన గౌరవం లభించింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టీచర్ రమ్యసుధ, కడప జిల్లాకు చెందిన స్కిల్ హబ్ కోఆర్డినేటర్ కె. వెంకట్రావులను ముఖ్యమంత్రి చంద్రబాబు తన పక్కనే వేదికపై కూర్చోబెట్టి సమున్నతంగా గౌరవించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.