మహిళల ఆసియా కప్: భారత్ బౌలర్ల ధాటికి పాక్ విలవిల.. 35 పరుగులకే 6 వికెట్లు డౌన్

Womens Asia Cup India bowlers rattle Pakistan as 6 wickets fall for 35 runs
  • మహిళల ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్
  • కేవలం 3 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన శ్రీ చరణి
  • దీప్తి శర్మ, షఫాలీ, ప్రేమ రావత్‌లకు తలో వికెట్
మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత జట్టు బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్, భారత బౌలింగ్ దాడికి పీకల్లోతు కష్టాల్లో పడింది. కేవలం 9.1 ఓవర్లలోనే 35 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయింది.

ఈ మ్యాచ్‌లో యువ బౌలర్ శ్రీ చరణి తన స్పెల్‌తో పాకిస్థాన్ పతనాన్ని శాసించింది. కేవలం రెండు ఓవర్లు బౌలింగ్ చేసి, 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టింది. ఆమె ధాటికి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ నిలవలేకపోయింది. గుల్ ఫిరోజా (0), షవాల్ జుల్ఫికర్ (14), ఆయేషా జాఫర్ (2)లను పెవిలియన్‌కు పంపి కోలుకోలేని దెబ్బతీసింది.

పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ను మునీబా అలీ (13), షవాల్ జుల్ఫికర్ (14) ఆచితూచి ప్రారంభించారు. తొలి వికెట్‌కు 27 పరుగులు జోడించి ఫర్వాలేదనిపించారు. అయితే, 27 పరుగుల వద్ద మునీబా అలీని షఫాలీ వర్మ ఔట్ చేయడంతో పాక్ పతనం మొదలైంది. కేవలం 8 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు కోల్పోయి దారుణంగా విఫలమైంది. దీప్తి శర్మ, ప్రేమ రావత్, షఫాలీ వర్మ తలో వికెట్ పడగొట్టి పాక్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టారు. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా (0)ను దీప్తి శర్మ ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపింది.

మొత్తం మీద, టాస్ గెలిచి భారీ స్కోరు సాధించాలనుకున్న పాకిస్థాన్ వ్యూహం పూర్తిగా విఫలమైంది. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించారు. దీంతో పాకిస్థాన్ స్వల్ప స్కోరుకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది.
Advertisement
Sri Charani
India vs Pakistan Womens Asia Cup
India Women Cricket Team
Womens Asia Cup 2026
Shafali Verma
Deepti Sharma

More Telugu News