2029 నాటికి మరో మూడు డీఎస్సీలు: మంత్రి నారా లోకేశ్ ప్రకటన
- విజయవాడలో ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం
- హాజరైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
- ఏపీలో విద్యావ్యవస్థను దేశంలోనే అగ్రగామిగా నిలపడమే లక్ష్యమని వెల్లడి
- వచ్చే ఏడాది ఏప్రిల్ లోపు వర్సిటీల్లో ఫ్యాకల్టీ నియామకాలు పూర్తి
- వివాదాస్పద జీవో 117 రద్దు, పారదర్శక బదిలీలతో ఉపాధ్యాయులకు న్యాయం
ఆంధ్రప్రదేశ్‌లో విద్యావ్యవస్థను దేశంలోనే అగ్రగామిగా నిలపడమే లక్ష్యమని, అందుకోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. 2029లోగా మరో మూడు మెగా డీఎస్సీలు నిర్వహించి, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేస్తామని ఆయన కీలక ప్రకటన చేశారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో శనివారం జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మెగా డీఎస్సీ ఫైలుపైనే తొలి సంతకం చేశారని, ఇచ్చిన మాటకు కట్టుబడి 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టామని తెలిపారు.
"సీబీఎన్ అంటే డీఎస్సీ, డీఎస్సీ అంటే సీబీఎన్" అని అభివర్ణించిన లోకేశ్, చంద్రబాబు నాయకత్వంలో గతంలో 14 డీఎస్సీల ద్వారా సుమారు రెండు లక్షల మంది ఉపాధ్యాయులను నియమించిన ఘనత ఆయనదేనని గుర్తుచేశారు. పని చేసేవాళ్లకే రాళ్ల దెబ్బలు తగులుతాయని, ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియని వారు తనపై విమర్శలు చేస్తున్నా పట్టించుకోనని అన్నారు. "ఓటమిని అంగీకరించడం అనేది నా డిక్షనరీలో లేదు. చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు వస్తుంటాయి. కానీ నా లక్ష్యం ఒక్కటే.. అంగన్‌వాడీ నుంచి పీజీ వరకు 'ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్'ను ప్రపంచంలోనే నెంబర్ వన్ చేయడం" అని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.
దశాబ్దాలుగా ఖాళీగా ఉన్న యూనివర్సిటీ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీపైనా మంత్రి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పూర్తి చేసి, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు కొత్త జవసత్వాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.
గత ప్రభుత్వానికి, ప్రజా ప్రభుత్వానికి తేడా ఇదే..
గత ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద జీవో 117 కారణంగా సుమారు 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వీడి ప్రైవేటుకు వెళ్లారని లోకేశ్ ఆరోపించారు. తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ జీవోను రద్దు చేసిందని, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాప్రతినిధులతో చర్చించి 'మోడల్ ప్రైమరీ స్కూల్' వ్యవస్థను తీసుకొచ్చామని వివరించారు. దీని ఫలితంగా ఈ ఏడాది ఏకంగా 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ బడుల్లో చేరారని, ఈ ఘనత పూర్తిగా ఉపాధ్యాయులదేనని ప్రశంసించారు. ఉపాధ్యాయుల సర్వీస్ విషయాల్లో పారదర్శకత కోసం 'లీప్ యాప్'ను తీసుకొచ్చామని, బదిలీల ప్రక్రియను కూడా పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు.
ప్రతి విద్యార్థి ప్రాణం విలువైందే..
ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఓ విషాదకర ఘటనను ప్రస్తావిస్తూ లోకేశ్ భావోద్వేగానికి గురయ్యారు. పేరెంట్-టీచర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి పక్కన కూర్చుని మాట్లాడిన ఓ విద్యార్థిని రెండు రోజులకే ఆత్మహత్య చేసుకోవడం తనను, ముఖ్యమంత్రిని తీవ్రంగా కలచివేసిందని అన్నారు. "ప్రతి బిడ్డ ముఖ్యమే, ప్రతి ప్రాణం విలువైందే (ఎవ్రీ చైల్డ్ మ్యాటర్స్, ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్). పిల్లల్లో ఏ చిన్న మార్పు కనిపించినా ఉపాధ్యాయులు గమనించాలి. వారిలో మానసిక స్థైర్యాన్ని, ఒత్తిడిని తట్టుకునే శక్తిని పెంచాల్సిన బాధ్యత మనందరిపై ఉంది" అని పిలుపునిచ్చారు. ఇందుకోసం త్వరలోనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తామని తెలిపారు. ఫెయిల్ (FAIL) అంటే 'ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్' అని పిల్లలకు నేర్పించాలని సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యారంగంపై చూపిస్తున్న శ్రద్ధను వివరిస్తూ, మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా రుచి చూసి, నాణ్యత పెంచాలని ఆదేశించారని గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తితోనే నాణ్యమైన బియ్యాన్ని అందిస్తున్నామన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం, సావిత్రిబాయి ఫూలే వంటి మహనీయులను ఉదాహరణగా చూపుతూ, ఒక ఉపాధ్యాయుడు తలచుకుంటే అద్భుతాలు సృష్టించగలడని, విద్యార్థుల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దగలడని అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని సింగపూర్, ఫిన్లాండ్ వంటి దేశాలకు విద్యా పర్యటనలకు పంపి, అక్కడి ఉత్తమ విధానాలను ఇక్కడ అమలు చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.