‘ఏ ప్రశ్నకైనా చాట్‌జీపీటీనే అడగాలంటోంది’.. ఏడేళ్ల కూతురు అలవాటు చూసి తండ్రికి కొత్త భయం!
- ఏడేళ్ల కూతురు చాట్‌జీపీటీపై ఆధారపడుతోందన్న తండ్రి
- ప్రతి ప్రశ్నకూ ఏఐని అడగాలని సూచిస్తోందని వెల్లడి
- తల్లిదండ్రులతో కలిసి వెతికే అవకాశం తగ్గుతోందని ఆందోళన
- ఉద్యోగాల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోందని వ్యాఖ్య
- ఏఐతో చర్చలు, మార్గదర్శకత్వం తగ్గొచ్చని అభిప్రాయం
గురుగ్రామ్‌కు చెందిన కరణ్ ధుండియా తన ఏడేళ్ల కూతురు అలవాటుపై చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు చర్చకు దారితీసింది. తల్లిదండ్రులకు తెలియని ఏ ప్రశ్న ఎదురైనా.. వెంటనే చాట్‌జీపీటీని అడగాలని కూతురు చెబుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అలవాటు సరదాగా అనిపించినా.. పిల్లలు సమాధానాలను వెతుక్కునే విధానాన్ని ఏఐ మార్చేస్తోందా? అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు.
కరణ్ లింక్డిన్‌లో తన అనుభవాన్ని పంచుకున్నారు. తన కూతురికి చాట్‌జీపీటీ అంటే అన్నీ తెలిసినట్టుగా భావిస్తోందని చెప్పారు. తల్లిదండ్రులకు ఏదైనా ప్రశ్నకు సమాధానం తెలియకపోతే.. “మనం కలిసి తెలుసుకుందాం” అని చెప్పడం లేదని, “చాట్‌జీపీటీని అడగండి” అని నేరుగా చెబుతోందని తెలిపారు.
అయితే కూతురు పూర్తిగా తప్పు చెప్పడం లేదని కరణ్ అంగీకరించారు. మనలో చాలామందికి గుర్తుండే విషయాల కంటే ఏఐ దగ్గర చాలా ఎక్కువ సమాచారం ఉండొచ్చన్నారు. కానీ పిల్లలకు ఏఐ ఇవ్వలేని మరో అనుభవం ఉందని చెప్పారు.
తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు సమాధానం తెలియక ఆగిపోవడం, అంచనా వేయడం, “నాకు తెలియదు” అని ఒప్పుకోవడం.. ఆ తర్వాత పిల్లలతో కలిసి సమాధానం వెతకడం వంటి సందర్భాలు ఎంతో విలువైనవని కరణ్ అన్నారు. ఇలాంటి అనుభవాలే పిల్లల్లో ఆలోచించే తత్వాన్ని పెంచుతాయని అభిప్రాయపడ్డారు.
ఇదే పరిస్థితి ఉద్యోగాల్లోనూ కనిపిస్తోందని ఆయన చెప్పారు. ఉద్యోగులకు సమాధానం తెలియకపోతే సహోద్యోగులను అడగడం, చర్చించడం కంటే వెంటనే ఏఐ టూల్‌ను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. ఏఐ వేగంగా సమాధానం ఇస్తున్నా.. ఆ సమాధానం కోసం వెతికే సమయంలో జరిగే చర్చలు, మార్గదర్శకత్వం, నేర్చుకునే అవకాశాలు తగ్గిపోతున్నాయని అన్నారు.
మంచి నాయకుడు ప్రతి ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పేవాడు కాదని.. “నాకు తెలియదు.. మనం కలిసి తెలుసుకుందాం” అని చెప్పగలిగేవాడని కరణ్ పేర్కొన్నారు. ఏఐని ఉపయోగించుకోవడం మంచిదే అయినా.. మనుషులు స్వయంగా ఆలోచించి సమాధానాలు వెతికే అవకాశాలను పూర్తిగా కోల్పోకూడదన్నదే ఆయన ఆందోళన.
కరణ్ పోస్ట్‌పై లింక్డిన్‌లో పలువురు స్పందించారు. ఏఐ సమాధానాలను వేగంగా అందించగలదని, కానీ సరైన ప్రశ్నలు అడగడం నేర్చుకోవడం ద్వారానే జ్ఞానం పెరుగుతుందని కొందరు అన్నారు.