కోల్ గ్యాసిఫికేషన్ స్కీమ్: పుకార్లను కొట్టిపారేసిన కేంద్రం
- కోల్ గ్యాసిఫికేషన్ స్కీమ్‌కు స్పందన లేదన్న వార్తల్లో నిజం లేదన్న కేంద్రం
- ఆరోపణలను ఖండించిన కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ
- ఇప్పటికే టీఎఫ్ఎల్, ఎన్‌టీపీసీల నుంచి దరఖాస్తులు వచ్చాయని వెల్లడి
- 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ లక్ష్యం
దేశంలో కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి ఆదరణ కరవైందంటూ వస్తున్న కథనాలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రూ. 37,500 కోట్ల ప్రోత్సాహకాలతో కూడిన ఈ పథకానికి ఒక్క దరఖాస్తు కూడా రాలేదన్న ప్రచారాన్ని కేంద్రం తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ఇటువంటి అసత్య ప్రచారాలు ప్రాజెక్ట్‌పై ఎలాంటి ప్రభావం చూపలేవని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
ఇప్పటికే ఈ పథకం కింద తాల్చేర్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (టీఎఫ్ఎల్), ఎన్‌టీపీసీ నుంచి దరఖాస్తులు అందినట్లు వెల్లడించింది. ఈ పథకానికి సంబంధించిన తొలి విడత దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 7తో ముగియనుందని ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 25 ప్రాజెక్టులు ఏర్పాటవుతాయని, తద్వారా సుమారు రూ. 2.5 లక్షల కోట్ల నుంచి రూ. 3 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి పైగా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇంధన అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశీయ బొగ్గు నిల్వలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ, 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాసిఫికేషన్ ప్రక్రియ ద్వారా వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఈ ఏడాది మే నెలలో ఈ ప్రతిష్ఠాత్మక పథకానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.