10,000mAh బ్యాటరీతో పోకో కొత్త ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే..!
- పోకో ఎక్స్8, ఎక్స్8 పవర్ భారత్‌లో విడుదల
- ఎక్స్8 పవర్ ధర రూ.35,999 నుంచి మొదలు
- ఎక్స్8 ప్రారంభ ధర రూ.29,999గా నిర్ణయం
- రెండు ఫోన్లలో 50MP ప్రధాన కెమెరా
- స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్
షావోమీ సబ్ బ్రాండ్ పోకో భారత్ మార్కెట్లో మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. పోకో ఎక్స్8 పవర్, పోకో ఎక్స్8 పేర్లతో వీటిని శుక్రవారం విడుదల చేసింది. వీటిలో ఎక్స్8 పవర్ ప్రత్యేకంగా 10,000mAh భారీ బ్యాటరీతో వచ్చింది. ఎక్స్8లో 9,000mAh బ్యాటరీ ఇచ్చారు. రెండు ఫోన్లలోనూ 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది.
పోకో ఎక్స్8 ప్రారంభ ధర రూ.29,999గా నిర్ణయించారు. పోకో ఎక్స్8 పవర్ ధర రూ.35,999 నుంచి మొదలవుతుంది. రూ.2,000 కూపన్ డిస్కౌంట్, రూ.1,000 అదనపు ఎక్స్‌ఛేంజ్ బోనస్ కలిపితే వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ.26,999, రూ.32,999కు తగ్గుతాయి.
ఈ రెండు ఫోన్ల విక్రయాలు సెప్టెంబర్ 11 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమవుతాయి. ఎక్స్8 పవర్ నలుపు, పసుపు రంగుల్లో లభిస్తుంది. ఎక్స్8 నలుపు, ఫైరీ ఆరెంజ్, ఫ్రాస్ట్ వైట్ రంగుల్లో వస్తుంది.
రెండు ఫోన్లలో 6.83 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్10+, డాల్బీ విజన్, 3,500 నిట్స్ వరకు గరిష్ఠ బ్రైట్‌నెస్ ఉన్నాయి. కార్నింగ్ గొరిల్లా విక్టస్ 2 రక్షణ కూడా ఇచ్చారు. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ66, ఐపీ68, ఐపీ69, ఐపీ69కే రేటింగ్స్ ఉన్నాయి.
పోకో ఎక్స్8 పవర్‌లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్, 8జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజ్ ఉన్నాయి. ఎక్స్8లో స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 4 చిప్‌సెట్ ఇచ్చారు.
కెమెరాల విషయానికి వస్తే.. రెండు ఫోన్లలో 50MP ప్రధాన కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్నాయి. పవర్ మోడల్‌లో 8MP అల్ట్రావైడ్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఎక్స్8లో 2MP డెప్త్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.