రూ.10 లక్షలకే టాటా కర్వ్ కొత్త వేరియంట్.. ఫీచర్లు అదుర్స్!
- కర్వ్ సిరీస్ ఎక్స్ ప్రారంభ ధర రూ.9.99 లక్షలు
- టాప్ వేరియంట్ ధర రూ.18.75 లక్షలు
- ప్యూర్ ఎక్స్ నుంచే 10.25 అంగుళాల స్క్రీన్
- క్రియేటివ్ ఎక్స్+లో పనోరమిక్ సన్‌రూఫ్
- టాప్ వేరియంట్లలో లెవెల్-2 ఏడీఏఎస్
టాటా మోటార్స్ తన ప్రముఖ ఎస్‌యూవీ కర్వ్‌లో కొత్త సిరీస్ ‘ఎక్స్’ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త సిరీస్‌లో వేరియంట్లను రీషఫుల్ చేయడంతో పాటు దిగువ, మధ్యస్థ వేరియంట్లలోనూ కీలక ఫీచర్లను అందించింది. సిరీస్ ‘ఎక్స్’ ధరలు సుమారు రూ.10 లక్షల నుంచి రూ.19 లక్షల వరకు ఉన్నాయి. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు.
కొత్త సిరీస్‌లో స్మార్ట్ ‘ఎక్స్’ బేస్ వేరియంట్. దీని ధర రూ.9,99,990. ఆ తర్వాత ప్యూర్ ‘ఎక్స్’ ధర రూ.10,99,990 నుంచి మొదలవుతుంది. ప్యూర్ ‘ఎక్స్+’ ధరలు పెట్రోల్ మాన్యువల్‌కు రూ.11,79,990, డీసీటీకి రూ.13,09,990, డీజిల్ మాన్యువల్‌కు రూ.13,09,990గా ఉన్నాయి. ప్యూర్ ఎక్స్+ డార్క్ ధరలు వరుసగా రూ.11,99,990, రూ.13,29,990, రూ.13,29,990గా ఉన్నాయి.
క్రియేటివ్ ఎక్స్+ ధర రూ.12,90,990 నుంచి మొదలవుతుంది. దీని డీసీటీ ధర రూ.14,20,990 కాగా డీజిల్ మాన్యువల్ ధర కూడా రూ.14,20,990. క్రియేటివ్ ఎక్స్+ డార్క్‌లో ఇవే ఆప్షన్ల ధరలు వరుసగా రూ.13,15,990, రూ.14,45,990, రూ.14,45,990గా ఉన్నాయి.
ఇక అకంప్లిష్డ్ ఎక్స్ ధర రూ.13,99,990 నుంచి మొదలవుతుంది. దీని పెట్రోల్ డీసీటీ ధర రూ.15,29,990, డీజిల్ మాన్యువల్ ధర కూడా రూ.15,29,990. అకంప్లిష్డ్ ఎక్స్ డార్క్‌లో పెట్రోల్ మాన్యువల్ ధర రూ.14,24,990 కాగా డీజిల్ మాన్యువల్ రూ.15,54,990, టీజీడీఐ డీసీటీ రూ.15,29,990గా ఉంది. టాప్ వేరియంట్ అకంప్లిష్డ్ ఎక్స్+ డార్క్ డీజిల్ మాన్యువల్, డీజిల్ డీసీటీ ధర రూ.18,74,990గా ఉన్నాయి.
ఫీచర్ల విషయానికి వస్తే ప్యూర్ ఎక్స్ నుంచే 10.25 అంగుళాల హర్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, రియర్ కెమెరా, పుష్-బటన్ స్టార్ట్, యూఎస్‌బీ పోర్టులు, వైఫై, జీపీఎస్ వంటి ఫీచర్లు లభిస్తాయి. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, ఈఎస్‌పీ, హిల్ హోల్డ్, ఏబీఎస్, ఈబీడీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
క్రియేటివ్ ఎక్స్+లో పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్-స్పాట్ మానిటర్, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటి అదనపు ఫీచర్లు వస్తాయి. టాప్ అకంప్లిష్డ్ ఎక్స్+లో 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 6-వే పవర్ డ్రైవర్ సీట్, ఎయిర్ ప్యూరిఫైయర్, 360 డిగ్రీ 3డీ కెమెరా, లెవెల్-2 ఏడీఏఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
వెనుక సీటు ప్రయాణికులకు మరింత స్థలం లభించేలా ముందు సీట్ల బ్యాక్‌రెస్ట్‌ను 10 మిల్లీమీటర్లు సన్నగా చేశారు. వెనుక సీటును 20 మిల్లీమీటర్లు వెనక్కి, 10 మిల్లీమీటర్లు కిందికి మార్చారు. దీంతో రెండో వరుసలో కూర్చునే వారికి స్పేస్ పెరిగింది.
ఇంజిన్ ఆప్షన్లలో మార్పు లేదు. 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.2 లీటర్ డైరెక్ట్-ఇంజెక్షన్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు కొనసాగుతున్నాయి. వీటికి 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.