మంత్రి కొండా సురేఖపై వేటుకు రంగం సిద్ధం!
- మంత్రి కొండా సురేఖపై వేటు వేయనున్న కాంగ్రెస్ అధిష్ఠానం
- వివరణ ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సురేఖకు నిరాశ
- క్రమశిక్షణ ఉల్లంఘనగా పరిగణించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
- మంత్రివర్గ ప్రక్షాళనకు అనుమతి కోరిన ముఖ్యమంత్రి
- అసెంబ్లీ సమావేశాల తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం
తెలంగాణ మంత్రి కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం అత్యంత కఠిన వైఖరితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించడం దాదాపు ఖాయమైనట్లేనని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల పార్టీ నాయకత్వంపై ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వివరణ ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సురేఖకు అక్కడ ఊహించని పరిణామాలు ఎదురైనట్లు సమాచారం.
పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు నిరాకరించగా, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా నామమాత్రంగా మాట్లాడి పంపించేశారని తెలిసింది. అధిష్ఠానం నుంచి ఎలాంటి హామీ లభించకపోవడంతో తీవ్ర అసంతృప్తితో వెనుదిరిగిన సురేఖ.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయడంతో ఇక వేటు తప్పదనే నిర్ణయానికి హైకమాండ్ వచ్చినట్లు సమాచారం.
మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్.. ఢిల్లీలో ఖర్గే, వేణుగోపాల్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. సురేఖ వ్యవహారాన్ని తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘనగా పరిగణించాలని, అంతర్గత ప్రజాస్వామ్యంగా చూడవద్దని సీఎం రేవంత్ రెడ్డి అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిసింది. ఇదే సమయంలో, ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తవుతున్నందున మంత్రివర్గ ప్రక్షాళనకు అనుమతించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఆశావాహుల జాబితాతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా ఆయన చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని, అదే సమయంలో కొండా సురేఖకు ఉద్వాసన పలకాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు ఏఐసీసీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా ఆమెను బర్తరఫ్ చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది.