ఎడులాపురం గ్రామంలో ఉద్రిక్తత.. రెండు వాహనాల దగ్ధం
- ఖమ్మం జిల్లా ఎడులాపురం గ్రామంలో అర్ధరాత్రి కలకలం
- ఓ వ్యక్తికి చెందిన రెండు బైక్‌లకు నిప్పంటించిన దుండగులు
- ఘటనలో పూర్తిగా దగ్ధమైన ద్విచక్రవాహనాలు
- కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు
ఖమ్మం జిల్లాలో అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని వ్యక్తులు అలజడి సృష్టించారు. రెండు ద్విచక్ర వాహనాలకు దుండగులు నిప్పంటించిన ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. ఈ ఘటనలో రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. ఖమ్మం రూరల్ మండలం ఎడులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎడులాపురం గ్రామంలో సోమవారం అర్ధరాత్రి ఈ దుశ్చర్య చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వేర్పుల ఉపేందర్ (చిన్న) తన ఇంటి బయట నిలిపి ఉంచిన రెండు బైక్‌లకు దుండగులు నిప్పు పెట్టారు. మంటలు భారీగా చెలరేగడంతో ఆ వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో గ్రామస్థులు అప్రమత్తమై బయటకు వచ్చారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కొందరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
ఈ దారుణానికి పాల్పడింది ఎవరు, దీని వెనుక ఉన్న అసలు కారణాలేమిటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణ పూర్తయిన తర్వాత ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.