నేపాల్ వరదలతో బెంగాల్‌కు బిగ్ వార్నింగ్.. హిమాలయాల్లో జరిగితే ఇక్కడా ముప్పే!
- తూర్పు హిమాలయాల్లో వరుస విపత్తుల ముప్పు
- భూకంపంతో కొండచరియలు, వరదలు సంభవించే ప్రమాదం
- భూకంప ముప్పు ఉన్న జోన్‌లో ఉన్న డార్జిలింగ్
- 2025లో భారీ వర్షాలతో డార్జిలింగ్‌లో 24 మంది మృతి
- బెంగాల్ వరకు చేరిన 2023 సౌత్ లోనాక్ వరద ప్రభావం
నేపాల్-టిబెట్ సరిహద్దులో ఇటీవల సంభవించిన భారీ వరదలు తూర్పు హిమాలయాలపై మరోసారి ఆందోళన పెంచాయి. అక్కడ జరిగిన విపత్తు బెంగాల్‌ను నేరుగా ప్రభావితం చేయకపోయినా.. హిమాలయాల్లో ఒక విపత్తు మరో భారీ ప్రమాదానికి దారితీసే ప్రమాదాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు.
భూకంపం, కొండచరియలు, మంచు విరిగిపడటం, భారీ వర్షాలు, హిమ సరస్సులు అకస్మాత్తుగా ఉప్పొంగడం.. ఇవన్నీ పరస్పరం ప్రభావితం చేసుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు కొండచరియలు నదిని అడ్డుకుంటే తాత్కాలిక సరస్సు ఏర్పడొచ్చు. ఆ అడ్డంకి తెగితే ఒక్కసారిగా భారీ వరద దిగువ ప్రాంతాలకు దూసుకెళ్లొచ్చు. ఇలాంటి పరిణామాలను ‘క్యాస్కేడింగ్ హజార్డ్స్’గా పిలుస్తారు.
డార్జిలింగ్‌కు ఎందుకు ముప్పు?
డార్జిలింగ్ ప్రాంతం కూడా భౌగోళికంగా సున్నితమైన హిమాలయ వ్యవస్థలోనే ఉంది. నిటారైన కొండలు, భారీ వర్షాలు, కొండచరియలు, భూకంప ముప్పు అక్కడి ప్రమాదాలను పెంచుతున్నాయి. 2025 అక్టోబరులో కేవలం 12 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో 300 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురవడంతో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 24 మంది మృతి చెందినట్లు ‘నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్’ అంచనా వేసింది.
డార్జిలింగ్ సెస్మిక్ జోన్-4లో ఉంది. దీంతో భారీ భూకంపం సంభవిస్తే ప్రకంపనలతో పాటు కొండచరియలు, రాళ్లు విరిగిపడటం, నదులకు అడ్డంకులు ఏర్పడటం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు.
సిక్కిం ఘటన ఇచ్చిన హెచ్చరిక
2023లో సౌత్ లోనాక్ సరస్సు ఉప్పొంగిన ఘటన ఈ ప్రమాదాన్ని కళ్లకు కట్టింది. భారీ నీటి ప్రవాహం తీస్తా నదిలోకి దూసుకెళ్లి వంతెనలు, రహదారులు, జలవిద్యుత్ ప్రాజెక్టులకు తీవ్ర నష్టం కలిగించింది. ఆ వరద ప్రభావం బెంగాల్ వరకు కనిపించింది.
ఐసీఐఎంఓడీ ప్రకారం తూర్పు హిమాలయాల్లో హిమ సరస్సుల ఆకస్మిక ఉప్పెనల ముప్పు 2050 ప్రాంతంలో గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మంచు, శాశ్వతంగా గడ్డకట్టిన నేలల్లో మార్పులు రావడం కొండ ప్రాంతాల స్థిరత్వాన్ని ప్రభావితం చేయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అందుకే బెంగాల్‌కు అవసరమైనది వరదలను మాత్రమే ఎదుర్కొనే ప్రణాళిక కాదు. హిమ సరస్సులు, కొండచరియలు, భూకంపాలు, నదీ ప్రవాహాలను కలిపి ముందస్తు హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. హిమాలయాల్లో మొదలయ్యే ప్రమాదం వందల కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు చేరే అవకాశం ఉన్నందున.. విపత్తు నిర్వహణ కూడా సరిహద్దులు దాటి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.