‘సందీప్ కోసం ఎంత దూరమైనా వెళ్తా’.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ కామెంట్స్!
- సందీప్‌రెడ్డి వంగాతో బంధంపై మాట్లాడిన విజయ్
- సందీప్ కోసం ఎంత దూరమైనా వెళ్తానని వ్యాఖ్య
- ‘అర్జున్‌రెడ్డి’ సమయంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నామని వ్యాఖ్య
- ఆ సినిమా కోసం భూములు తాకట్టు పెట్టారని వెల్లడి
- సెప్టెంబర్ 3న ‘రోమాంచకం’ విడుదల
దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాతో తనకున్న అనుబంధం గురించి హీరో విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సందీప్‌పై తనకున్న ప్రేమను మాటల్లో చెప్పలేనని అన్నారు. ఆయన కోసం తాను ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమని తెలిపారు.
‘రోమాంచకం’ ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడారు. సందీప్‌తో తనది కేవలం హీరో-దర్శకుడి బంధం కాదన్నారు. అన్నదమ్ముల అనుబంధం, స్నేహం కంటే కూడా తమ మధ్య మరేదో ఉందని చెప్పారు.
‘అర్జున్‌రెడ్డి’ సినిమా సమయంలో తామిద్దరం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నామని విజయ్ గుర్తు చేసుకున్నారు. ‘‘అప్పుడు మేం కలిసి యుద్ధానికి వెళ్లినట్టే. ఏం చేస్తున్నామో మాకే తెలియదు. సినిమా ఆడకపోతే మా పరిస్థితి ఏమయ్యేదో ఊహించలేం. ఇద్దరి దగ్గరా డబ్బు లేదు. పలుకుబడి లేదు. అభిమానులు కూడా లేరు’’ అని అన్నారు.
‘అర్జున్‌రెడ్డి’ విజయాన్ని గుర్తు చేసుకోవడం కంటే.. ఆ సినిమా కోసం సందీప్‌తో కలిసి గడిపిన క్షణాలే తనకు ఎక్కువగా గుర్తొస్తాయని విజయ్ చెప్పారు. సినిమా నిర్మాణంలో ఎదురైన ఒత్తిడి, కష్టాలు, పోరాటాలను ఇద్దరూ కలిసి ఎదుర్కొన్నామని తెలిపారు.
ఆ సినిమా కోసం నిర్మాతలు ప్రణయ్, ప్రభాకర్ తమ భూములను తాకట్టు పెట్టి డబ్బులు సమకూర్చారని విజయ్ వెల్లడించారు. సందీప్‌పై నమ్మకంతో వారు సినిమా తీశారని, సందీప్ కూడా తనపై నమ్మకం ఉంచారని చెప్పారు. తమ కుటుంబం, సంపాదన, భవిష్యత్తును ఒక సినిమా కోసం పణంగా పెట్టిన పరిస్థితి అది అని గుర్తు చేసుకున్నారు.
‘‘సందీప్ నా కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. నేను కూడా సందీప్ కోసం ఎంత దూరమైనా వెళ్తా’’ అని విజయ్ దేవరకొండ అన్నారు.
‘రోమాంచకం’ సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్, ఉపేంద్ర లిమాయే, వెంకటేశ్ కాకుమాను తదితరులు ఇందులో నటించారు.