అశ్విన్ ఆల్-టైమ్ గ్రేట్స్.. సచిన్‌కు అగ్రస్థానం, ఆసక్తికర ఎంపికలు
- భారత అత్యుత్తమ క్రికెటర్‌గా సచిన్‌ను ఎంచుకున్న అశ్విన్
- విరాట్ కోహ్లీ కంటే జస్ప్రీత్ బుమ్రాకే ప్రాధాన్యం
- ధోనీపై వీరేంద్ర సెహ్వాగ్‌కు ఓటేసిన అశ్విన్
- సెమీస్‌లో బుమ్రాపై కపిల్ దేవ్‌ను ఎంపిక
- తుది ఎంపికలో వ్యక్తిగత ఇష్టం కూడా చూశానన్న అశ్విన్
భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడు ఎవరనే చర్చపై మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను భారత ఆల్ టైమ్ గ్రేటెస్ట్ క్రికెటర్‌గా అభివర్ణించాడు. అయితే, ఈ ఎంపిక ప్రక్రియలో విరాట్ కోహ్లీ కంటే జస్ప్రీత్ బుమ్రాకు అశ్విన్ ప్రాధాన్యమివ్వడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఒక క్రీడా వెబ్‌సైట్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా, అశ్విన్ పలువురు దిగ్గజ క్రీడాకారుల మధ్య ఒకరిని ఎంచుకోవాల్సి వచ్చింది. క్వార్టర్ ఫైనల్స్ తరహా పోరులో కోహ్లీ, బుమ్రా మధ్య ఎవరిని ఎంచుకుంటారని అడగ్గా, అశ్విన్ బుమ్రా వైపు మొగ్గు చూపాడు. "టెస్టు క్రికెట్‌లో కోహ్లీ ఒక లెజెండ్, అందులో సందేహం లేదు. కానీ నేను జస్ప్రీత్ బుమ్రానే ఎంచుకుంటాను" అని తెలిపాడు. బౌలర్‌గా తనకున్న పక్షపాతం కూడా ఈ నిర్ణయానికి కారణమై ఉండవచ్చని సరదాగా వ్యాఖ్యానించాడు.
ఇదే క్రమంలో ఎంఎస్ ధోనీ కంటే వీరేంద్ర సెహ్వాగ్‌ను, అనిల్ కుంబ్లే కంటే బుమ్రాను అశ్విన్ ఎంచుకున్నాడు. అనంతరం జరిగిన సెమీ ఫైనల్స్ రౌండ్‌లో బుమ్రాపై దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్‌కు ఓటేశాడు. 1983 ప్రపంచకప్ విజయంలో కపిల్ దేవ్ పోషించిన పాత్రను, ఆయన ఆల్ రౌండ్ ప్రతిభను అశ్విన్ కొనియాడాడు. ఇక ఫైనల్‌లో కపిల్ దేవ్‌ను కాదని, సచిన్ టెండూల్కర్‌ను భారత అత్యుత్తమ క్రికెటర్‌గా ప్రకటించాడు. "చివరిగా వ్యక్తిగత ఇష్టాయిష్టాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే, నేను సచిన్‌నే ఎంచుకుంటాను" అని అశ్విన్ స్పష్టం చేశాడు.