ఏపీలో మెడికల్ కోర్సుల ఫీజుల పెంపు: ఉత్తర్వులు జారీ చేసిన వైద్యారోగ్యశాఖ!
- ఎంబీబీఎస్, బీడీఎస్ ఫీజులు 10 శాతం పెంపు
- పీజీ కోర్సుల ఫీజు 15 శాతం పెంపు
- 2026-27 విద్యాసంవత్సరానికి వర్తించనున్న ఫీజులు
ఆంధ్రప్రదేశ్‌లో వైద్యవిద్య (మెడికల్) కోర్సుల ఫీజులను ప్రభుత్వం సవరించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ఫీజులను 10 శాతం, పీజీ కోర్సుల ఫీజును 15 శాతం పెంచుతూ వైద్యారోగ్యశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంచిన రుసుములు 2026-27 విద్యాసంవత్సరానికి వర్తించనున్నాయి.
ఎంబీబీఎస్ (MBBS) ఫీజులు:
కన్వీనర్ కోటా: రూ. 18,150
మేనేజ్‌మెంట్ కోటా: రూ. 14.52 లక్షలు
ఎన్నారై కోటా: రూ. 43.56 లక్షలు
బీడీఎస్ (BDS) ఫీజులు:
కన్వీనర్ కోటా: రూ. 15,730
మేనేజ్‌మెంట్ కోటా: రూ. 4.84 లక్షలు
ఎన్నారై కోటా: రూ. 14.52 లక్షలు
పీజీ (PG) & సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫీజులు:
పీజీ కన్వీనర్ కోటా: రూ. 5.71 లక్షలు
పీజీ మేనేజ్‌మెంట్ కోటా: రూ. 11.42 లక్షలు
పీజీ ఎన్నారై కోటా: రూ. 66.12 లక్షలు
సూపర్ స్పెషాలిటీ కోర్సులు: రూ. 19.38 లక్షలు