బ్యాగులో బంగారం, నగదు, ఆస్తిపత్రాలు.. తిరుమలలో పొగొట్టుకున్న బ్యాగు భక్తులకు తిరిగి అప్పగింత
- తిరుమల ఘాట్ రోడ్డులో భక్తులు పోగొట్టుకున్న బ్యాగ్‌ను అప్పగించిన టీటీడీ
- ఒక బైకర్ చొరవతో భద్రతా సిబ్బందికి చేరిన విలువైన బ్యాగ్
- బ్యాగులో రూ.2 లక్షల నగదు, 61 గ్రాముల బంగారం, ఆస్తి పత్రాలు
- పూర్తి ఆధారాలు పరిశీలించిన తర్వాతే యజమానులకు అందజేత
- టీటీడీ సిబ్బంది, బైకర్‌కు కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబం
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల పట్ల టీటీడీ సిబ్బంది మరోసారి తమ నిజాయతీని, సేవాభావాన్ని చాటుకున్నారు. తిరుమల ఘాట్ రోడ్డులో గుంటూరుకు చెందిన ఓ కుటుంబం పోగొట్టుకున్న లక్షల రూపాయల విలువైన నగలు, నగదు ఉన్న బ్యాగును భద్రంగా వారికి అప్పగించి ప్రశంసలు అందుకున్నారు. మానవత్వం, బాధ్యత కలగలిసి ఓ భక్తుల కుటుంబంలో ఆనందం నింపిన ఈ ఘటన తిరుమలలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా బ్రాడీపేటకు చెందిన పోతుల నారాయణ, సునీత దంపతులు తమ కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తిరుపతి నుంచి తిరుమల వచ్చే రెండో ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా, తమ బ్యాగును ఎక్కడో జారవిడుచుకున్నారు. ఆ బ్యాగులో 61 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2,02,840 నగదుతో పాటు సుమారు రూ.10 లక్షల విలువైన భూమి ఒప్పంద పత్రాలు ఉన్నాయి.
ఉదయం సుమారు 6 గంటల సమయంలో ఘాట్ రోడ్డుపై వెళుతున్న ఓ బైకర్ ఆ బ్యాగును గమనించారు. వెంటనే దాన్ని తీసుకుని, ఉదయం 6:30 గంటలకు జీఎన్సీ టోల్‌గేట్ వద్ద విధుల్లో ఉన్న హోంగార్డు రెడ్డప్పరావుకు అప్పగించారు. సమాచారం అందుకున్న టీటీడీ భద్రతా సిబ్బంది ఆ బ్యాగును కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు తరలించి భద్రపరిచారు.
మరోవైపు, బ్యాగ్ పోయిందని గుర్తించిన భక్తుల కుటుంబం ఆందోళనతో వెతుకుతూ టీటీడీ అధికారులను సంప్రదించింది. వారు చెప్పిన వివరాలు, అందించిన గుర్తింపు ఆధారాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ ఆదేశాల మేరకు, ఏవీఎస్వోలు కృష్ణయ్య, వెంకట శివకుమార్‌ల సమక్షంలో బ్యాగును తెరిపించి, అందులోని వస్తువులను యజమానులతో సరిచూయించారు. నగదు, బంగారం, విలువైన పత్రాలు అన్నీ సురక్షితంగా ఉన్నాయని భక్తులు నిర్ధారించుకున్నారు.
అనంతరం అధికారులు ఆ బ్యాగును వారికి సురక్షితంగా అప్పగించారు. పోయిందనుకున్న తమ విలువైన వస్తువులు తిరిగి దక్కడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. కష్టకాలంలో బాధ్యతగా వ్యవహరించి బ్యాగును అప్పగించిన బైకర్‌కు, సమయస్ఫూర్తితో దానిని భద్రపరిచి తమకు అందజేసిన టీటీడీ భద్రతా సిబ్బందికి వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.