చరిత్రలోనే అతిపెద్ద డ్యామ్ విపత్తు: ఒక్క రాత్రిలో 62 డ్యాములు బద్ధలు.. 2.30 లక్షల మంది బలి!
- 1975లో చైనాలో బాంకియావో డ్యామ్ విపత్తు
- టైఫూన్ కారణంగా రికార్డుస్థాయిలో కురిసిన వర్షాలు
- ఒక్క రాత్రిలో 62 డ్యాములు ధ్వంసం
- దాదాపు 2.30 లక్షల మంది మృతి చెందినట్లు అంచనా
- 20 ఏళ్ల పాటు నిజాలు దాచిపెట్టిన చైనా ప్రభుత్వం
నేపాల్‌లో సంభవించిన తాజ వరదల నేపథ్యంలో, ప్రకృతి ప్రకోపానికి మానవ నిర్మిత కట్టడాలు చిక్కితే జరిగే విధ్వంసానికి చైనాలోని బాంకియావో డ్యామ్ ఉదంతమే ఒక ప్రబల నిదర్శనం. ప్రపంచ చరిత్రలోనే అత్యంత దారుణమైన డ్యామ్ వైఫల్యంగా ఇది మిగిలిపోయింది. ఈ ఘోర విపత్తులో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 2,30,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
1975 ఆగస్టులో వచ్చిన 'నీనా' టైఫూన్ ప్రభావంతో చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో రికార్డు స్థాయి వర్షాలు కురిశాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే 1,000 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో బాంకియావో డ్యామ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఆగస్టు 7వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత డ్యామ్ పైనుంచి నీరు పొంగిపొర్లి, కేవలం ఆరు గంటల వ్యవధిలోనే అది కుప్పకూలిపోయింది. దీని ఫలితంగా సుమారు 701 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో జనావాసాలపై విరుచుకుపడింది. ఈ ఉద్ధృతికి సమీపంలోని సిమన్‌తాన్ డ్యామ్‌తో పాటు మొత్తం 62 ఆనకట్టలు ఒకదాని తర్వాత ఒకటి పేకమేడల్లా కూలిపోయాయి.
ఈ జల ప్రళయానికి తక్షణమే సుమారు 26,000 మంది బలవ్వగా, అనంతరం ఏర్పడిన కరవు, అంటువ్యాధుల కారణంగా మొత్తం మృతుల సంఖ్య 2.30 లక్షలకు చేరిందని అంతర్జాతీయ నివేదికలు అంచనా వేశాయి. అయితే, చైనా ప్రభుత్వం ఈ మహా విషాదం తాలూకు వివరాలను దాదాపు రెండు దశాబ్దాల పాటు ప్రపంచానికి తెలియకుండా అత్యంత గోప్యంగా ఉంచింది.
1951-52 మధ్య కాలంలో నిర్మించిన ఈ డ్యామ్‌ను ఒకప్పుడు 'ఐరన్ డ్యామ్' అని పిలిచేవారు. కానీ నిర్మాణ లోపాలు, అధికారుల వైఫల్యాలు, సరైన సమయంలో హెచ్చరికలు జారీ చేయకపోవడం వంటివి ఈ ఘోర విషాదానికి ప్రధాన కారణాలని విశ్లేషణలు వెల్లడించాయి. ఈ ఘటన జరిగిన సుదీర్ఘ కాలం తర్వాత, పాత డ్యామ్ స్థానంలో 1993లో నూతన ఆనకట్టను నిర్మించారు.