సోనియా గాంధీ బుక్ విషయంలో ట్విస్ట్.. ‘మేం ప్రచురణకర్తలం కాదు’ అన్న పెంగ్విన్
- సోనియా గాంధీ పుస్తకంపై పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ క్లారిటీ
- భారత్‌లో ‘బిలాంగింగ్’కు తాము ప్రచురణకర్తలం కాదని ప్రకటన
- ఎడిటోరియల్ మార్పుల కారణంగా తప్పుకున్నామన్న వార్తలపై ఖండన
- పుస్తకాన్ని ప్రచురించేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని వెల్లడి
- రచయితలతో చర్చలు ప్రచురణ ప్రక్రియలో సాధారణమేనని వ్యాఖ్య
కాంగ్రెస్ నేత సోనియా గాంధీ రాయనున్న ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకంపై పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఈ పుస్తకానికి భారత్‌లో తాము ప్రచురణకర్తలం కాదని స్పష్టం చేసింది.
పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా నుంచి పుస్తకం విషయంలో వెనక్కి తగ్గిందని, సోనియా గాంధీ ఎడిటోరియల్ మార్పులకు అంగీకరించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని సంస్థ తెలిపింది.
‘బిలాంగింగ్’ పుస్తకాన్ని ప్రచురించేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని పెంగ్విన్ వెల్లడించింది. ప్రచురణ ప్రక్రియలో భాగంగా రచయితలు ఇచ్చే సమాచారాన్ని వాస్తవ నిర్ధారణ చేయడం, పుస్తకానికి ఉపయోగపడే సూచనలు ఇవ్వడం తమ బాధ్యత అని పేర్కొంది.
అయితే సోనియా గాంధీతో జరిగిన చర్చల వివరాలను మాత్రం వెల్లడించేందుకు సంస్థ నిరాకరించింది. రచయితతో జరిగిన చర్చలు గోప్యమైనవని, వాటిపై మరింత వ్యాఖ్యానించబోమని స్పష్టం చేసింది.
మరోవైపు అమెరికాకు చెందిన ప్రముఖ ప్రచురణ సంస్థ ‘Alfred A.Knopf’.. సోనియా గాంధీ జ్ఞాపకాల పుస్తకాన్ని నవంబర్ 10న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.