ఒంగోలు తాగునీటి కష్టాలకు చెక్.. రంగరాయుడు చెరువు వద్ద కొత్త ప్రాజెక్టు
- ఒంగోలు నగరానికి 24 గంటల తాగునీటి సరఫరాకు శ్రీకారం
- అమృత్ 2.0 ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్
- రూ.424.42 కోట్ల అంచనా వ్యయంతో పథకం అమలు
- 51 వేలకు పైగా ఇళ్లకు కొత్తగా కనెక్షన్లు.. 605 కి.మీ. పైప్‌లైన్
ప్రకాశం జిల్లా ఒంగోలు నగర ప్రజల దశాబ్దాల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. నగరానికి 24 గంటల పాటు నిరంతరాయంగా తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన అమృత్ 2.0 ప్రాజెక్టుకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శ్రీకారం చుట్టారు. రంగరాయుడు చెరువు వద్ద రూ.424.42 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ పథకానికి ఆయన నేడు శంకుస్థాపన చేశారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా ఒంగోలు నగరంలోని 35 డిస్ట్రిబ్యూషన్ జోన్లను పునర్వ్యవస్థీకరిస్తారు. మొత్తం 605.30 కిలోమీటర్ల పొడవున కొత్త పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను నిర్మించి, 51,340 గృహాలకు నేరుగా సర్వీస్ కనెక్షన్లు ఇవ్వనున్నారు. దీని ద్వారా నగరంలోని ప్రతి ఇంటికీ నాణ్యమైన తాగునీరు అందనుంది. పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా ఈ ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కేవలం నిర్ణీత సమయాల్లో కాకుండా 24 గంటలూ నీటిని అందుబాటులో ఉంచడమే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశమని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్ రావు, విజయ్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.