పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం: ఆటోను ఢీకొట్టిన బస్సు.. ఏడుగురి మృతి
- పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు
- పుట్టినరోజు వేడుక నుంచి తిరిగి వస్తుండగా ఘటన
- పది మందికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమం
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిలకలూరిపేట అద్దంకి సెంటర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఆటోరిక్షాను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి (జీజీహెచ్) తరలించారు. మృతులను బొంత బాబు, మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మి, గంగమ్మ, మరియమ్మగా గుర్తించగా, మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది.
మృతులంతా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. ప్రకాశం జిల్లా కొండమంజులూరులో జరిగిన ఓ పుట్టినరోజు వేడుకకు హాజరై తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనతో వేలూరు గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.