యశ్ సినిమాకు కోర్టు రక్షణ.. ‘టాక్సిక్’పై నెగెటివ్ ప్రచారానికి బ్రేక్
- యశ్ ‘టాక్సిక్’ సినిమాపై దుష్ప్రచారంపై కోర్టు ఇంజంక్షన్
- పిటిషన్ దాఖలు చేసిన నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్
- సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టవద్దని ఆదేశం
- సెప్టెంబర్ 28 వరకు అమల్లో ఉండనున్న మధ్యంతర ఉత్తర్వులు
పాన్ ఇండియా స్టార్ యశ్ కథానాయకుడిగా రూపొందుతున్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సినిమాపై సోషల్ మీడియా వేదికగా సాగుతున్న తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ బెంగళూరు కోర్టు తాత్కాలిక ఇంజంక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది.
నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అడిషనల్ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ఈ మేరకు ఆదేశాలు వెలువరించింది. సినిమా ప్రతిష్ఠను దెబ్బతీసేలా లేదా కించపరిచేలా ఎలాంటి తప్పుడు వార్తలు, కంటెంట్‌ను ప్రచురించడం, పోస్ట్ చేయడం, స్ట్రీమింగ్ లేదా షేర్ చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'తో పాటు ఇతర మాధ్యమాల్లోనూ ఈ ఆంక్షలు వర్తిస్తాయని పేర్కొంది.
ఈ మధ్యంతర ఉత్తర్వులు తదుపరి విచారణ తేదీ అయిన సెప్టెంబర్ 28 వరకు అమల్లో ఉంటాయని కోర్టు వెల్లడించింది. ఈ ఆదేశాలను దుర్వినియోగం చేయరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే ముందస్తు నోటీసు లేకుండానే ఇంజంక్షన్‌ను రద్దు చేస్తామని కోర్టు హెచ్చరించింది. సినిమాపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులకు, సంస్థలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది.