హైదరాబాద్ నుంచి నేపాల్ వెళ్లిన వారు సురక్షితం
- నేపాల్‌లో మెరుపు వరదలతో 95 మంది మృతి, 500 మంది గల్లంతు
- హైదరాబాద్ నుంచి కైలాస యాత్రకు వెళ్లిన 156 మంది సురక్షితం
- తమకు సాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
- బాధితులను రప్పిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే పార్థసారథి
హిమాలయ దేశం నేపాల్‌ను మెరుపు వరదలు ముంచెత్తాయి. ఈ ఆకస్మిక ప్రకృతి బీభత్సంలో ఇప్పటివరకు 95 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 500 మంది వరకు గల్లంతయ్యారు. ఇదే సమయంలో కైలాస మానసరోవర యాత్ర కోసం తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన యాత్రికుల భద్రతపై ఆందోళన నెలకొనగా, వారంతా క్షేమంగా ఉన్నట్లు తెలియడంతో కుటుంబసభ్యులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళితే, కైలాస మానసరోవర యాత్రకు హైదరాబాద్ నుంచి వెళ్లిన 156 మంది యాత్రికుల బృందం సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందింది. వరదల ప్రభావం లేని ప్రాంతంలో వారు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
వీరంతా చైనా సరిహద్దుకు సమీపంలో సురక్షితంగానే ఉన్నప్పటికీ, భారీ వర్షాలు, వరదల కారణంగా రోడ్డు మార్గాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. దీంతో వారు ఉన్న ప్రాంతం నుంచి నేపాల్ రాజధాని కాఠ్‌మాండూ చేరుకోవడం కష్టతరంగా మారింది. తమను సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని వారు కోరుతున్నారు.
వీరిలో, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన యాత్రికులు కూడా ఉన్నారు. తాము ప్రస్తుతం చైనా భూభాగంలోని డార్సి ప్రాంతంలో ఓ హోటల్ లో ఉన్నామని, భూమికి 15 వేల అడుగుల ఎత్తులో ఉండడం వల్ల తమకేమీ వరద ముప్పులేదని తెలిపారు. అయితే, తాము సెప్టెంబరు 1న భారత్ తిరిగి రావాల్సి ఉందని, తమ వీసాలు ట్రావెల్ ఏజెన్సీ వద్ద ఉండడంతో ఎలా రావాలో అర్థం కావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వెంటనే స్పందించారు. ఆయన నేపాల్‌లో చిక్కుకున్న యాత్రికులతో ఫోన్‌లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. వారిని సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వంతో సమన్వయం చేసి తగిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.