కూటమి ప్రభుత్వంపై పుష్ప శ్రీవాణి ఫైర్.. సెల్‌ఫోన్ వెలుగులో వైద్యమంటూ వీడియో పోస్ట్
- భద్రగిరి ఆసుపత్రిలో సెల్‌ఫోన్ వెలుగులో బాలుడికి వైద్యం చేశారని ఆరోపణ
- జనరేటర్ సౌకర్యం లేకుండానే ఆసుపత్రిని ప్రారంభించారని ఆగ్రహం
- ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? అని ప్రశ్న
కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గిరిజన ప్రాంతంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని, రోగులకు చీకటిలో సెల్‌ఫోన్ వెలుగులో వైద్యం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు ఘటనకు సంబంధించిన ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.
కురుపాం నియోజకవర్గం, గుమ్మలక్ష్మీపురం మండలంలోని భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో (సీహెచ్‌సీ) ఈ ఘటన జరిగిందని ఆమె తెలిపారు. వేడినీళ్లు ఒంటిపై పడి తీవ్రంగా గాయపడిన ఐదేళ్ల బాలుడికి, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వైద్య సిబ్బంది సెల్‌ఫోన్ లైట్ల వెలుగులో చికిత్స చేస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. కొద్ది రోజుల క్రితమే ఈ ఆసుపత్రిని ప్రారంభించారని ఆమె గుర్తుచేశారు.
ప్రచార ఆర్భాటం కోసం పూర్తి సదుపాయాలు కల్పించకుండానే మంత్రులు, ఎమ్మెల్యేలు ఆసుపత్రిని ప్రారంభించారని శ్రీవాణి మండిపడ్డారు. "విద్యుత్ జనరేటర్ లేకుండా ఆసుపత్రిని ఎవరైనా ప్రారంభిస్తారా? ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం కాదా? గిరిజనుల జీవితాలంటే ఇంత చులకనా?" అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాలకులుగా ఉన్నారా లేక ప్రజల పాలిట శాపమా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి పాలనలో గిరిజన ప్రజల దుస్థితికి ఇదే నిదర్శనమని, ఇది మంచి ప్రభుత్వమేనా అని ఆమె తన పోస్టులో నిలదీశారు.