ఆ శాఖకు నేను సంరక్షకుడిని మాత్రమే: ముంబైలో నారా లోకేశ్
ముంబైలో ఫార్చ్యూన్ ఇండియా సంస్థ '40 అండర్ 40' అవార్డుల కార్యక్రమం
ముఖ్య అతిథిగా హాజరైన నారా లోకేశ్
ఆర్పీఎస్జీ గ్రూప్ వైస్ చైర్మన్ శాశ్వత్ గోయెంకా అడిగిన ప్రశ్నలకు లోకేశ్ జవాబులు
కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న నారా బ్రహ్మణి

వ్యాపారమైనా, రాజకీయమైనా తాను నిర్వహించే సంస్థలకు, శాఖలకు కేవలం సంరక్షకుడిని (కస్టోడియన్) మాత్రమేనని, తనకు అప్పగించిన బాధ్యతలను మరింత మెరుగైన స్థితికి తీసుకెళ్లడమే తన లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. పెట్టుబడుల ఆకర్షణలో స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ అనే మూడు సూత్రాలే తమ విజయ రహస్యాలని ఆయన వెల్లడించారు. దేశంలోని యువ వ్యాపారవేత్తలు, ప్రతిభావంతులకు ఫార్చ్యూన్ ఇండియా సంస్థ '40 అండర్ 40' పేరుతో ముంబైలో అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్, మంత్రి నారా లోకేశ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
ఈ వేడుకలో భాగంగా, డైరీ రంగంలో విలువ ఆధారిత ఉత్పత్తుల విభాగంలో హెరిటేజ్ సంస్థ సాధించిన ప్రగతికి గాను, ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణికి కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ చేతుల మీదుగా 'ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40' అవార్డును ప్రదానం చేశారు.
ఏపీ పెట్టుబడుల రహస్యం ఇదే
అనంతరం జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. ఆర్పీఎస్జీ గ్రూప్ వైస్ చైర్మన్ శాశ్వత్ గోయెంకా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఆసక్తికర సమాధానాలిచ్చారు. "ప్రభుత్వ నిర్వహణలో మీరు క్రమశిక్షణ పాటిస్తున్నారు. పొదుపు గురించి మాట్లాడారు. ఈ ఆలోచన మీకు ఎక్కడి నుంచి వచ్చింది?" అని గోయెంకా ప్రశ్నించగా, లోకేశ్ బదులిచ్చారు. "వ్యాపారంలో అయినా, రాజకీయాల్లో అయినా మనం నిర్వహించే సంస్థలకు కేవలం సంరక్షకులం మాత్రమేనని నేను బలంగా నమ్ముతాను. ఒక మంత్రిగా నేను ఇక్కడికి వచ్చింది కేవలం మానవ వనరుల అభివృద్ధి, విద్యాశాఖకు సంరక్షకుడిగా మాత్రమే. గతంలో వ్యాపారంలో, ఇప్పుడు ప్రభుత్వ బాధ్యతల్లోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాను" అని వివరించారు.
పెట్టుబడుల కోసం అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టేది ఏమిటన్న ప్రశ్నకు లోకేశ్ రెండు ప్రధాన కారణాలను తెలిపారు. "మొదటిది, మేము అనుసరించే మూడు 'ఎస్'ల విధానం. స్పీడ్ (వేగం), సర్వీస్ (సేవ), స్టెబిలిటీ (స్థిరత్వం). మేము ఎంత వేగంగా అనుమతులు ఇస్తున్నామో చాలా పరిశ్రమలకు తెలుసు. ఇక సర్వీస్ విషయానికొస్తే, పెట్టుబడిదారులకు వారి ప్రాజెక్టుల పురోగతిపై ప్రతి శనివారం రాత్రి నేనే స్వయంగా మెసేజ్ పంపి ఫీడ్‌బ్యాక్ ఇస్తాను. మూడోది, విధానాల్లో స్థిరత్వం. ప్రభుత్వాలు మారినా మా విధానాలు కొనసాగుతాయి. ఇది పెట్టుబడిదారులకు భరోసా ఇస్తుంది" అని లోకేశ్ అన్నారు.
"రెండో ముఖ్య కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. సీబీఎన్ అంటే అదొక బ్రాండ్. ఆయనకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. పెట్టుబడులకు అవసరమైన తలుపులు తెరువగల ముఖ్యమంత్రి ఉండటంతో మా పని సగం సులభమవుతుంది. మిగిలిన సగం పనిని నేను సమావేశ మందిరంలో ఒప్పందాన్ని ఖరారు చేయడం ద్వారా పూర్తి చేస్తాను. మా ఇద్దరి భాగస్వామ్యమే ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా నిలుపుతోంది" అని లోకేశ్ తెలిపారు.
కుటుంబ వ్యాపారాల్లో ఉన్న యువత తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి, కొత్త రంగాల్లో పరిశోధనలపై భారీగా పెట్టుబడులు పెట్టాలని లోకేశ్ పిలుపునిచ్చారు. అంతరిక్షం, క్వాంటమ్ టెక్నాలజీ, మెటీరియల్ సైన్సెస్ వంటి రంగాల్లో భారతదేశం ఎంతో సాధించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. "రేపటి తరం గర్వపడేలా ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి నగరం చరిత్ర సృష్టించబోతోంది. ప్రపంచమంతా చెప్పుకునేలా ఒక మోడల్‌ను ఏపీలో నిర్మించాలన్నది మా లక్ష్యం. ఈ మార్పులో మీరంతా భాగస్వాములు కావాలి. మేము చేసే ప్రతి తప్పు నుంచి నేర్చుకోవడానికి, రాష్ట్రాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి మీ సలహాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం" అని యువ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి లోకేశ్ అన్నారు.