‘భారత్ ధర్మశాల కాదు’: 2047కు అమిత్ షా భారీ భద్రతా బ్లూప్రింట్
- 2047 అభివృద్ధి లక్ష్యానికి అంతర్గత భద్రత కీలకమని అమిత్ షా వ్యాఖ్య
- చొరబాట్లు, ఉగ్రవాదం, డ్రగ్స్‌పై ముందస్తు చర్యలకు పిలుపు
- అక్రమ చొరబాట్ల నుంచి దేశాన్ని విముక్తం చేయడమే లక్ష్యమని వెల్లడి
- ‘భారత్ ధర్మశాల కాదు’ అంటూ అక్రమ వలసదారులపై తీవ్ర వ్యాఖ్యలు
- కొత్త క్రిమినల్ చట్టాల పూర్తి అమలుకు ఏడాది గడువు లక్ష్యం
2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యానికి పటిష్ఠ అంతర్గత భద్రతే పునాది అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. చొరబాట్లు, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, భవిష్యత్ భద్రతా సవాళ్లపై ఇప్పటి నుంచే ముందస్తు వ్యూహాలతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన ఇంటెలిజెన్స్ బ్యూరో ‘జాతీయ భద్రతా సదస్సు’ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు.
ముప్పు రాకముందే చర్యలు
మరో 15 నుంచి 20 ఏళ్లలో ఎదురయ్యే భద్రతా సవాళ్లను ఇప్పటి నుంచే గుర్తించాలని అమిత్ షా సూచించారు. అవి పెద్ద సంక్షోభాలుగా మారకముందే తిప్పికొట్టే వ్యూహాలు సిద్ధం చేయాలని చెప్పారు. దేశంలో మూడు ప్రధాన అంతర్గత భద్రతా హాట్‌స్పాట్ల నుంచి ఎదురైన ముప్పులను సమర్థంగా అధిగమించామని పేర్కొన్నారు.
‘ఇది ధర్మశాల కాదు’
సరిహద్దు భద్రతపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందని షా తెలిపారు. ఎనిమిది నెలలుగా అన్ని భూ సరిహద్దు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపామని చెప్పారు. నాలుగు అంచెల సరిహద్దు భద్రతా ప్రణాళికను రాష్ట్రాలకు అందించామని వెల్లడించారు.
‘‘ఇది ధర్మశాల కాదు. ఈ దేశ పౌరులకు మాత్రమే ఇక్కడ నివసించే హక్కు ఉంది’’ అని షా వ్యాఖ్యానించారు. అక్రమ చొరబాటుదారులు జాతీయ భద్రత, ఆర్థిక స్థిరత్వం, జనాభా సమతుల్యతకు ముప్పని హెచ్చరించారు.
3 ఏళ్లలో కేసుల పరిష్కారమే లక్ష్యం
కొత్తగా తెచ్చిన మూడు క్రిమినల్ చట్టాలను వచ్చే ఏడాదిలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు షా చెప్పారు. క్రిమినల్ కేసులు సుప్రీంకోర్టు స్థాయి వరకు మూడేళ్లలో పరిష్కారమయ్యేలా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. శిక్షల శాతాన్ని 25 శాతం పెంచడమూ లక్ష్యమేనన్నారు.
ఉగ్రవాదం, డ్రగ్స్‌పై ఉక్కుపాదం
పీఎఫ్‌ఐపై నిషేధం తర్వాత చేపట్టిన చర్యలను కేంద్ర-రాష్ట్ర సమన్వయానికి ఉదాహరణగా షా పేర్కొన్నారు. ఉగ్రవాద నెట్‌వర్క్‌లను పూర్తిగా ధ్వంసం చేసేందుకు ‘ప్రహార్’ వ్యూహాన్ని రోజువారీ భద్రతా కార్యకలాపాల్లో అమలు చేయాలని సూచించారు.
మాదకద్రవ్యాలపై ‘డిటెక్ట్, డిస్‌రప్ట్, డిస్ట్రాయ్’ విధానాన్ని అనుసరించాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. 2026-29 మాదకద్రవ్య నియంత్రణ విజన్ డాక్యుమెంట్‌ను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు.
ఏఐతో కొత్త భద్రతా కవచం
సీసీటీఎన్‌ఎస్, ఐసీజేఎస్, నాట్‌గ్రిడ్, నాఫిస్ డేటాబేస్‌ల అనుసంధానంతో శక్తిమంతమైన నిఘా వ్యవస్థ ఏర్పడిందని షా తెలిపారు. కృత్రిమ మేధ, డేటా విశ్లేషణ, ప్రవర్తనా సరళి అధ్యయనం ద్వారా భవిష్యత్ ముప్పులను ముందే గుర్తించాలని యువ అధికారులకు సూచించారు.