కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు.. ఆరుగురి దుర్మరణం

Kodada road accident private bus hits parked container six killed
  • ప్రమాద సమయంలో  బస్సులో 42 మంది ప్రయాణికులు
  • మరో 20 మందికి తీవ్ర గాయాలు.. కొందరి పరిస్థితి విషమం 
  • హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా ఘటన
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ మండలం దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున ఆగి ఉన్న కంటైనర్ లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

హైదరాబాద్ నుంచి ఏలూరుకు 42 మంది ప్రయాణికులతో ఈ ప్రైవేటు బస్సు బయలుదేరింది. కోదాడ సమీపంలోని దొరకుంట వద్దకు రాగానే, జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన కంటైనర్‌ను డ్రైవర్ గమనించకపోవడంతో వేగంగా వెళ్లి ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఘోరం జరిగిపోయింది.

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ఉన్నారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉండగా, మరొకరి వివరాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా రహదారిపై వాహనాల రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Kodada road accident
Suryapet bus crash
Private bus accident Telangana
Hyderabad to Eluru bus accident
National Highway road accident
Kodada news today

More Telugu News