కెనడా దిగుమతులపై 50 శాతం సుంకాలు.. ట్రంప్ సంచలన నిర్ణయం
- వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కొత్త టారిఫ్‌లు అమలు
- కెనడా వల్లే తమకు వాణిజ్య లోటు వస్తోందన్న ట్రంప్
- అమెరికా నిర్ణయంపై ప్రతీకార చర్యలకు కెనడా సిద్ధం
అమెరికా, కెనడా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. కెనడా నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులు, వాహన విడిభాగాలు, ఉక్కుపై ఏకంగా 50 శాతం మేర సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ కొత్త టారిఫ్‌లు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.
తమ దేశ వ్యవసాయ ఉత్పత్తులపై కెనడా అధిక సుంకాలను విధిస్తోందని, దీనివల్ల అమెరికా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ట్రంప్ ఆరోపించారు. కెనడా వైఖరి కారణంగానే తమకు 60 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఏర్పడిందని ఆయన మండిపడ్డారు. ఇకపై కెనడాను ప్రత్యేక దేశంగా పరిగణించబోమని, వాణిజ్య వ్యవహరాల్ల్లో ఆ దేశంతో కలిసి ముందుకు సాగడం కష్టంగా మారిందని వ్యాఖ్యానించారు.
కెనడా వాణిజ్యంలో 95 శాతం వాటా అమెరికాతోనే ముడిపడి ఉందని, తమతోనే ఆ దేశానికి అత్యధిక అవసరం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, అమెరికాలో తయారైన వస్తువులకు మాత్రం ఈ సుంకాల నుంచి మినహాయింపు ఉంటుందని ఆయన వెల్లడించారు.
ఇరు దేశాల మధ్య ఇటీవల జరిగిన వాణిజ్య చర్చలు విఫలమవ్వడంతోనే ట్రంప్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ నిర్ణయంపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్రంగా స్పందించారు. అమెరికాపై ప్రతీకార సుంకాలను విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సుంకాలు సెప్టెంబర్ 8 నుంచే అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడించారు. ఇప్పటికే కెనడాకు చెందిన 20 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై అమెరికా 50 శాతం సుంకాలను విధించిన నేపథ్యంలో, తాజా పరిణామాలతో ఇరు దేశాల మధ్య వాణిజ్య పోరు మరింత ముదిరే అవకాశం ఉంది.