రాజకీయ సన్యాసం ప్రసక్తే లేదు: మమతా బెనర్జీ
- బీజేపీని కనుమరుగు చేసే వరకు విశ్రమించనని శపథం
- జనగణన పేరుతో ఎన్ఆర్‌సీ అమలుకు కుట్ర అని ఆరోపణ
- అన్నపూర్ణ భండార్ పథకంపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్
- ఓటర్ల తొలగింపుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని వెల్లడి
తాను రాజకీయాల నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బీజేపీని అధికార పీఠం నుంచి దించే వరకు తన పోరాటం ఆగదని ఆమె తేల్చిచెప్పారు. సోమవారం ఆన్‌లైన్ వేదికగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన నాలుగు నెలల్లోనే బీజేపీ అసలు స్వరూపం ప్రజలకు అర్థమైందని ఆమె పేర్కొన్నారు. ఎన్ఆర్‌సీ అమలు చేసేందుకే కేంద్ర ప్రభుత్వం జనగణనను ఒక సాకుగా వాడుకుంటోందని ఆరోపించారు. జనగణన దరఖాస్తులపై సంతకాలు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 'అన్నపూర్ణ భండార్' పథకం కింద ఆర్థిక సాయం అందడంలో జాప్యం జరుగుతోందని, అనర్హత సాకుతో లబ్ధిదారుల సంఖ్యను కుదించడం ఎన్నికల వాగ్దానాలను ఉల్లంఘించడమేనని ఆమె విమర్శించారు.
ఇటీవల జాదవ్‌పుర్ విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ, వామపక్ష విద్యార్థి సంఘాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల వెనుక బీజేపీ హస్తం ఉందని ఆమె ఆరోపించారు. క్యాంపస్‌లలో హింసను ప్రేరేపిస్తూ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ ద్వారా లక్షలాది మంది అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారని, వారి పేర్లను తిరిగి చేర్చేందుకు అవసరమైతే మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.