3 లక్షల మంది రష్యా కొత్త సైనికులు.. యుద్ధంలో రష్యా భారీ సన్నాహాలు: జెలెన్‌స్కీ

Zelenskyy Russia Preparing 3 Lakh New Soldiers for War
  • రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్న ఉక్రెయిన్ - రష్యా యుద్ధం
  • తమపై విరుచుకుపడేందుకు రష్యా సన్నాహాలు చేస్తోందని ఆరోపణ
  • ఆయుధ సంపత్తిని భారీగా పెంచుకుంటోందని విమర్శ

ఉక్రెయిన్-రష్యా మధ్య పోరు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్న వేళ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమపై విరుచుకుపడేందుకు రష్యా పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోందని, అందులో భాగంగా కొత్తగా దాదాపు 3 లక్షల మంది సైనికులను సమీకరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తోందని ఆయన ఆరోపించారు.


డొనెట్స్క్ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా మాస్కో అడుగులు వేస్తోందని జెలెన్‌స్కీ తెలిపారు. సెప్టెంబరులో రష్యా పార్లమెంటరీ ఎన్నికలు ముగిసిన అనంతరం ఈ కొత్త బలగాల సమీకరణ ప్రక్రియ ఊపందుకుంటుందని అన్నారు. ఈ ఏడాది ఆరంభం నుంచి రష్యా పెద్ద సంఖ్యలో సైనికులను కోల్పోయినప్పటికీ, తన ఆయుధ సంపత్తిని భారీగా పెంచుకుంటోందని చెప్పారు. రష్యా ప్రస్తుతం ఏటా సుమారు 1,300 బాలిస్టిక్ క్షిపణులను తయారు చేసే స్థాయికి చేరుకుందని ఆరోపించారు. యుద్ధానికి ముగింపు పలికే దిశగా వచ్చే వేసవి కాలం నాటికి శాంతి చర్చలు జరిగే అవకాశం ఉండవచ్చని జెలెన్‌స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
Volodymyr Zelenskyy
Russia Ukraine War
Russian Army Mobilization
Donetsk Region
Ballistic Missile Production
Ukraine Peace Talks

More Telugu News