సారంపల్లి మృతి పట్ల కేసీఆర్ సంతాపం

KCR condoles the death of Sarampally Mallareddy
  • రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత
  • గొప్ప రైతు ఉద్యమ నాయకుడని కేసీఆర్ కితాబు
  • ఆయన మరణం భారత రైతాంగ పోరాటాలకు తీరని లోటు అని వ్యాఖ్య

అఖిలభారత రైతు సంఘం నేత, కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 


సారంపల్లి మల్లారెడ్డి తన జీవితకాలమంతా రైతాంగ సమస్యల పరిష్కారం కోసం, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం నిబద్ధతతో పోరాటం చేసిన గొప్ప రైతు ఉద్యమ నాయకుడని కేసీఆర్ కొనియాడారు. ఆయన మరణం భారత రైతాంగ పోరాటాలకు తీరని లోటని పేర్కొన్నారు. మల్లారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Advertisement
Sarampally Mallareddy
KCR
All India Kisan Sabha
Communist Party Leader
Telangana News
Farmers Movement Leader

More Telugu News