రూమర్స్‌పై గోవిందా సీరియస్.. రూ.100 కోట్ల దావా హెచ్చరిక!

Govinda serious on rumors warns of 100 crore lawsuit
  • తప్పుడు ప్రచారం చేసేవారిపై రూ.100 కోట్ల దావా వేస్తానని హెచ్చరిక
  • ఈ మేరకు మీడియా, సోషల్ మీడియాకు పబ్లిక్ నోటీసు జారీ
  • భార్య సునీత, రాఖీ సావంత్ సంభాషణ వైరల్ అయిన నేపథ్యంలో నిర్ణయం
  • డీప్‌ఫేక్‌, ఏఐ కంటెంట్‌పైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ
బాలీవుడ్ నటుడు, మాజీ ఎంపీ గోవిందా తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్రంగా స్పందించాడు. తన పెళ్లికి సంబంధించి తప్పుడు, నిరాధారమైన సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిస్తూ పబ్లిక్ నోటీసు జారీ చేశాడు. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, మీడియా సంస్థలు, కంటెంట్ క్రియేటర్లు ఎవరైనా తన గురించి లేదా తన కుటుంబం గురించి కల్పిత, ధ్రువీకరించని సమాచారాన్ని ప్రచురించవద్దని ఈ నోటీసులో స్పష్టం చేశాడు.

గోవిందా భార్య సునీతా అహుజా, నటి రాఖీ సావంత్‌తో జరిపిన సంభాషణ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన మరుసటి రోజే ఈ నోటీసు వెలువడటం గమనార్హం. నటి రాణి స్వర్ణకర్‌ను గోవిందా పెళ్లి చేసుకోవాలనుకోవడంతోనే తాను విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నానని ఆ సంభాషణలో సునీత చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గోవిందా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు.

ఫొటోలు, వీడియోలు, మార్ఫింగ్ చిత్రాలు, డీప్‌ఫేక్‌లు, ఏఐ టెక్నాలజీతో తన అనుమతి లేకుండా వాయిస్, ఇమేజ్, గుర్తింపును వాడుకోవడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని నోటీసులో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత 2023, ఐటీ చట్టం 2000 ప్రకారం సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు.

దోషులుగా తేలిన వారి నుంచి రూ.100 కోట్ల వరకు నష్టపరిహారం క్లెయిమ్ చేయడంతో పాటు, వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం, ఆస్తుల లావాదేవీలపై ఆంక్షలు, పాస్‌పోర్టుల జప్తు వంటి చర్యల కోసం కూడా కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించాడు. తన పబ్లిక్ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు వ్యవస్థీకృతంగా పుకార్లు వ్యాపింపజేస్తున్నారని గోవిందా ఆందోళన వ్యక్తం చేశాడు.  
Advertisement
Govinda
Sunita Ahuja
Defamation Lawsuit
Bollywood News
Rakhi Sawant
Rani Swarnakar

More Telugu News