విద్యా హబ్‌గా హైదరాబాద్.. కేంబ్రిడ్జ్, లండన్ వర్సిటీలకు రేవంత్ ఆహ్వానం

Hyderabad as Education Hub Revanth Reddy Invites Cambridge and London Universities
  • లండన్ యూనివర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
  • హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటుపై లండన్ వర్సిటీ సానుకూలత
  • కేంబ్రిడ్జ్ వర్సిటీ ప్రతినిధులతోనూ సీఎం బృందం చర్చలు
  • హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా మార్చడమే లక్ష్యం
  • తెలంగాణతో కలిసి పనిచేసేందుకు కేంబ్రిడ్జ్ ప్రొఫెసర్ల ఆసక్తి
తెలంగాణకు అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రితో పాటు మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని బృందం 'లండన్ యూనివర్సిటీ'ని సందర్శించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ప్రతినిధులు వెల్లడించారు. తెలంగాణలో ఉన్న అనుకూలతలు, విద్యా రంగంలో ఉన్న అవకాశాలను సీఎం బృందం వారికి వివరించింది.

అంతకుముందు రేవంత్ రెడ్డి బృందం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో సమావేశమై విద్య, పరిశోధన రంగాల్లో పరస్పర భాగస్వామ్య అవకాశాలపై చర్చించింది. హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌ను ఏర్పాటు చేసి, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యా కోర్సులను, పరిశోధనా కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం కోరారు. ప్రపంచస్థాయి అత్యుత్తమ విద్యాసంస్థలకు హైదరాబాద్ ప్రధాన గమ్యస్థానంగా మారుతోందని ఈ సందర్భంగా ఆయన వివరించారు.

ఈ పర్యటనలో భాగంగా కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్లు జయదీప్ ప్రభు, వెంకట శిరీష్ గండికోట.. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ విజ్ఞాన కేంద్రంగా (గ్లోబల్ నాలెడ్జ్ హబ్) తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ విద్యాసంస్థలను ఆహ్వానించారు.                                
Advertisement
Revanth Reddy
Hyderabad Education Hub
Cambridge University
University of London
Telangana Global Knowledge Hub
Sridhar Babu

More Telugu News