మెగా హీరోలపై వ్యాఖ్యలు.. చిక్కుల్లో బిగ్‌బాస్ విన్నర్ కల్యాణ్
- మెగాస్టార్ వేడుకలో బిగ్‌బాస్ విన్నర్ కల్యాణ్ పడాల ప్రసంగం
- చిరంజీవి, పవన్ కల్యాణ్‌ను ఏకవచనంతో సంబోధన
- పెద్దలకు గౌరవం ఇవ్వాలంటూ మండిపడుతున్న మెగా ఫ్యాన్స్
- కొందరు సమర్థిస్తున్నప్పటికీ ఆగని సోషల్ మీడియా ట్రోలింగ్
బిగ్‌బాస్ విజేతగా గుర్తింపు పొందిన కల్యాణ్ పడాల, మెగా హీరోలపై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర విమర్శల పాలయ్యారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల సందర్భంగా నిర్వహించిన ‘మెగా మహోత్సవం’లో ఆయన ప్రసంగిస్తూ.. చిరంజీవి, పవన్ కల్యాణ్‌లను ఏకవచనంతో సంబోధించడం వివాదానికి దారితీసింది.
గతంలో సైనికుడిగా పనిచేసి, ఆ తర్వాత బిగ్‌బాస్ షో ద్వారా ప్రజలకు చేరువైన కల్యాణ్ పడాల, ఈ వేడుకకు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. వేదికపై మాట్లాడుతూ.. చిరంజీవిని చిన్నప్పటి నుండి దైవ సమానుడిగా ఆరాధిస్తానని, పవన్ కల్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే ఇప్పటికీ గూస్‌బంప్స్ వస్తాయని కొనియాడారు. అయితే, ప్రసంగ మధ్యలో ఆవేశంతో చిరంజీవిని, పవన్ కల్యాణ్‌ను ‘అతను’, ‘బాస్ బ్రో అతను’ అని పదేపదే సంబోధించారు. అంతేకాకుండా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను ఏకవచనంతో సంబోధించడం చర్చనీయాంశమైంది.
ఈ వ్యాఖ్యలపై మెగా అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. "డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కల్యాణ్‌కు, చిత్ర పరిశ్రమ పెద్ద అయిన చిరంజీవికి కనీస గౌరవం ఇవ్వకపోవడం ఏంటి?" అని నెటిజన్లు నిలదీస్తున్నారు. ‘అసలు అతడిని స్టేజ్‌పైకి ఎక్కించింది ఎవరు?’ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
మరోవైపు కొందరు మాత్రం.. “అతడికి ఇది మొదటి పెద్ద వేదిక కావడంతో, భయం లేదా ఉద్వేగంతో పొరపాటు జరిగి ఉండవచ్చు, వదిలేయండి” అని కల్యాణ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. అయినప్పటికీ, మెజారిటీ అభిమానులు మాత్రం ఆయన మాట్లాడిన తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు.