నాలుగు దశాబ్దాలుగా పరారీ.. ఎట్టకేలకు పట్టుబడ్డ హత్య కేసు నిందితుడు

Murder suspect on the run for four decades finally arrested
  • 19 ఏళ్ల వయసులో నేరం చేసి బెయిల్‌పై విడుదలై పరారు
  • పుణేలో గుర్తింపు మార్చుకుని జీవిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు
  • టెక్నికల్ సర్వైలెన్స్‌తో నిందితుడిని పట్టుకున్న ముంబై పోలీసులు
దాదాపు నాలుగు దశాబ్దాలుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్న ఓ హత్య కేసు నిందితుడిని ఎట్టకేలకు ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సురేశ్ చందర్ అడగాలే (59) అనే వ్యక్తిని పుణే జిల్లాలోని రంజన్‌గావ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్‌తో 40 ఏళ్ల నాటి కేసులో పురోగతి లభించినట్లయింది.

సురేశ్‌కు 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక హత్య కేసులో ముంబై పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అయితే, విచారణ సమయంలో న్యాయస్థానం అతడికి బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌పై బయటకు వచ్చిన సురేశ్, ఆ తర్వాత కోర్టు విచారణకు హాజరుకాకుండా పరారయ్యాడు. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన అతడిపై కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసినప్పటికీ, దాదాపు 40 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.

దీర్ఘకాలంగా పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ముంబై పోలీసులు చేపట్టిన ప్రత్యేక గాలింపు చర్యల్లో భాగంగా, సాకినాకా పోలీస్ స్టేషన్ బృందం ఈ కేసును తిరిగి దర్యాప్తు చేసింది. సాంకేతిక పరిజ్ఞానం, విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారంతో నిందితుడు తన అసలు గుర్తింపును దాచుకుని పుణే జిల్లా, శిరూర్ తహసీల్ పరిధిలోని రంజన్‌గావ్‌లో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా ప్రణాళికతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం తరలించారు.                                
Advertisement
Suresh Chander Adagale
Mumbai Police
Murder suspect arrested
Absconding criminal caught
Sakinaka Police Station
Pune Ranjangaon arrest

More Telugu News