బాలీవుడ్ లో ఏజ్ గ్యాప్ పై మనీషా వ్యాఖ్యలు మరోసారి వైరల్
- బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య వయసు వివక్షపై మనీషా కొయిరాలా వ్యాఖ్యలు
- తాతల వయసులోనూ హీరోలుగా నటిస్తున్నారని, పెళ్లయితే హీరోయిన్లను పక్కనపెడుతున్నారని ఆవేదన
- నటీమణులను కేవలం కోరిక తీర్చే వస్తువులుగా చూడటం సరికాదని హితవు
- మహిళలు తమ ప్రతిభతో ఈ పరిస్థితిని ఎదుర్కోవాలని పిలుపు
- సీనియర్ నటి సిమీ గరేవాల్‌తో పాత ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు
బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య వయసు అంతరం, మహిళా నటులు ఎదుర్కొంటున్న వివక్షపై సీనియర్ నటి మనీషా కొయిరాలా చేసిన కొన్ని పాత వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ నటి సిమీ గరేవాల్ నిర్వహించిన 'రెండవూ విత్ సిమీ గరేవాల్' అనే చాట్ షోలో పాల్గొన్నప్పుడు ఆమె ఈ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా మనీషా మాట్లాడుతూ.. "ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. మన పరిశ్రమలో మనవళ్లు, మనవరాళ్లు ఉన్న నటులు కూడా ఇప్పటికీ హీరోలుగా నటిస్తున్నారు. కానీ ఒక నటికి పెళ్లి అయిందంటే చాలు, ఆమెను ఇక సినిమాలకు పనికిరాదన్నట్టు చూస్తారు. హీరో, హీరోయిన్ల మధ్య వయసు అంతరం స్పష్టంగా కనిపిస్తుంది. 40, 50 ఏళ్ల హీరో పక్కన కుర్ర హీరోయిన్ ఎందుకు? 40 ఏళ్లు పైబడిన హీరోయిన్ ఎందుకు ఉండకూడదు?" అని ప్రశ్నించారు.
పరిశ్రమలో మహిళలపై ఎన్నో ఆంక్షలు ఉన్నాయని, అయితే కాలక్రమేణా మహిళలు వాటికి వ్యతిరేకంగా పోరాడతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి సిమీ గరేవాల్ స్పందిస్తూ.. సినిమాల్లో హీరోయిన్లను కేవలం హీరో కోరికలను తీర్చే ఒక వస్తువుగా చూడటం వల్లే ఈ పరిస్థితి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
సిమీ వ్యాఖ్యలపై మనీషా స్పందిస్తూ, "ఒకరిచేత ఆరాధించబడటం మంచి విషయమే. కానీ కేవలం దానికే పరిమితం చేస్తే అది బాధాకరం. ఈ పరిస్థితిని మార్చడానికి మహిళలు కూడా ముందుకు రావాలి. తమ ప్రతిభతో, నటనతో నిరూపించుకోవాలి. నా శరీరాన్ని కాదు, నా పనిని, నా టాలెంట్‌ను చూడండి అని చెప్పగలగాలి. తెలివిగా వ్యవహరించి, ప్రజల దృష్టిని శరీరం నుంచి నటన వైపు మళ్లించాలి" అని వివరించారు. ఈ పాత ఇంటర్వ్యూ ఇప్పుడు మళ్లీ తెరపైకి రావడంతో, చిత్ర పరిశ్రమలో లింగ వివక్షపై చర్చ మరోసారి ఊపందుకుంది.