డిప్యూటీ చైర్మన్ ఎన్నిక వేళ ఏపీ శాసనమండలిలో కొత్త వివాదం
- మండలి డిప్యూటీ చైర్మన్‌గా వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు ఏకగ్రీవం
- కొత్త డిప్యూటీ చైర్మన్‌ను స్థానంలోకి తీసుకెళ్లే సంప్రదాయానికి కూటమి దూరం
- అధికార పక్షం తీరుపై వైసీపీ నేత బొత్స తీవ్ర అభ్యంతరం
- ఇది వెన్నుపోటు పార్టీ నైజమని విమర్శ
- సభా సంప్రదాయాలను గౌరవించాలని హితవు
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, ఆయన ఎన్నిక అనంతరం సభలో ఒక అసాధారణ పరిణామం చోటుచేసుకుంది. నూతన డిప్యూటీ చైర్మన్‌ను అధ్యక్ష స్థానానికి తీసుకెళ్లే సంప్రదాయానికి అధికార కూటమి పార్టీల సభ్యులు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
బుధవారం మండలిలో చైర్మన్ మోషేన్ రాజు, మాధవరావు ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. అనంతరం సంప్రదాయం ప్రకారం, అన్ని పార్టీల సభ్యులు కలిసి కొత్త డిప్యూటీ చైర్మన్‌ను చైర్ వద్దకు తీసుకురావాలని కోరారు. అయితే, అధికార పక్ష సభ్యులు ఎవరూ ముందుకు రాకపోవడంతో పాటు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో వైసీపీ సభ్యులే ఆయనను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు.
ఈ ఘటనపై మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఇలాంటి పరిణామం ఎప్పుడూ జరగలేదని, సభా సంప్రదాయాలను అగౌరవపరచడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. "ఇది వెన్నుపోటు పార్టీ తీరును మరోసారి రుజువు చేసింది. మంత్రులు రూల్ బుక్స్ పట్టుకుని నీతులు చెప్పడం కాదు, విలువలు పాటించాలి" అని బొత్స విమర్శించారు. అన్ని పక్షాలను సమదృష్టితో చూడాలని ఈ సందర్భంగా ఆయన చైర్మన్‌ను కోరారు.