బరువు తగ్గుతోంది.. మరి కొవ్వు కరుగుతోందా? ఈ 5 సంకేతాలు చెబుతాయి!
- నడుము కొలత తగ్గితే కొవ్వు తగ్గుతున్న సంకేతం
- దుస్తులు వదులుగా మారడం మరో ముఖ్యమైన సూచన
- బరువు తగ్గుతూనే వ్యాయామంలో బలం పెరగడం సానుకూలమే
- కండరాల ఆకృతి స్పష్టంగా కనిపించడం కొవ్వు తగ్గుదలను సూచన
- బరువు నెమ్మదిగా తగ్గడం మెరుగైన సంకేతం
బరువు తగ్గాలని ప్రయత్నించేవాళ్లు ముందుగా చూసేది తూకం యంత్రాన్నే. రోజూ బరువు చూసుకుంటూ సంఖ్య తగ్గుతుంటే సంతోషపడతారు. కానీ బరువు తగ్గిందంటే శరీరంలోని కొవ్వు కూడా తగ్గిందని చెప్పలేం. శరీరంలో నీరు, గ్లైకోజెన్, తిన్న ఆహారం వంటి వాటి పరిమాణం మారినా బరువులో తేడా కనిపిస్తుంది. నిజంగా కొవ్వు తగ్గుతుందో? లేదో? తెలుసుకోవాలంటే శరీరంలో కనిపించే కొన్ని మార్పులను గమనించాలి.
నడుము సైజు తగ్గుతోందా?
కొవ్వు తగ్గుతున్నప్పుడు ముందుగా గమనించగల మార్పుల్లో నడుము చుట్టుకొలత తగ్గడం ఒకటి. గతంలో బిగుతుగా ఉన్న ప్యాంట్లు ఇప్పుడు కాస్త వదులుగా అనిపిస్తే అది మంచి సంకేతమే. ముఖ్యంగా బరువు పెద్దగా తగ్గకపోయినా నడుము కొలత తగ్గుతుంటే శరీర కొవ్వు తగ్గే అవకాశం ఉంది.
దుస్తులు వదులవుతున్నాయా?
స్కేల్‌పై పెద్దగా మార్పు లేకపోయినా చొక్కాలు, ప్యాంట్లు వదులుగా మారుతున్నాయా? అయితే శరీరంలో మార్పు జరుగుతున్నట్టే. నడుము, పొట్ట, తొడలు, ఛాతీ దగ్గర దుస్తుల ఫిట్ ఎలా మారుతోందో గమనించండి.
వ్యాయామంలో బలం పెరుగుతోందా?
బరువు తగ్గే సమయంలో కండరాలు తగ్గిపోకుండా చూసుకోవడం ముఖ్యం. వ్యాయామం చేస్తూ గతంలో కంటే ఎక్కువ బరువు ఎత్తగలగడం, అదే బరువుతో ఎక్కువసేపు చేయగలగడం మంచి సూచన. ఒకవైపు నడుము తగ్గుతూ.. మరోవైపు వ్యాయామంలో బలం పెరుగుతుంటే శరీర కొవ్వు తగ్గుతూ కండరాలు నిలబడుతున్నాయని అర్థం చేసుకోవచ్చు.
శరీరాకృతిలో తేడా కనిపిస్తోందా?
కొవ్వు తగ్గే కొద్దీ శరీర ఆకృతి క్రమంగా మారుతుంది. చేతులు, భుజాలు, ఛాతీ, పొట్ట, కాళ్ల దగ్గర కండరాలు మరింత స్పష్టంగా కనిపించవచ్చు. ఈ మార్పులు ఒక్కరోజులో కనిపించవు. కొన్ని వారాల వ్యవధిలో ఒకే రకమైన దుస్తులతో ఫొటోలు తీసుకుంటే తేడా బాగా తెలుస్తుంది.
బరువు క్రమంగా తగ్గుతోందా?
రెండు మూడు రోజుల్లోనే బరువు బాగా తగ్గిపోతే అదంతా కొవ్వు కరిగినట్లు కాదు. శరీరంలోని నీరు తగ్గడం వల్ల కూడా తూకం ఒక్కసారిగా పడిపోవచ్చు. దీనికి బదులు కొన్ని వారాల పాటు బరువు క్రమంగా తగ్గుతూ, నడుము కొలత కూడా తగ్గుతుంటే కొవ్వు తగ్గుతున్న అవకాశాలు ఎక్కువ.
వెయింగ్ మెషీన్ చెప్పే సంఖ్యనే అంతా అనుకోవద్దు. బరువుతో పాటు నడుము కొలత, ఫిట్ దుస్తులు, వ్యాయామంలో బలం, శరీరాకృతిలో మార్పులను కూడా గమనించాలి. ముఖ్యంగా బరువు తగ్గాలనే తొందరలో అతిగా తినడం మానేయడం మంచిది కాదు. సమతుల ఆహారం, తగినంత ప్రొటీన్, క్రమం తప్పని వ్యాయామం, మంచి నిద్రతో నెమ్మదిగా బరువు తగ్గడం ఆరోగ్యకరమైన మార్గం.