ఇంటర్ బోర్డులో విజిలెన్స్ సోదాలు.. మళ్లీ తెరపైకి 2019 ఫలితాల వివాదం!
- 2019 నాటి ఇంటర్ ఫలితాల వివాదంపై కొనసాగుతున్న విచారణ
- గ్లోబరీనా సంస్థ అక్రమాలపై ప్రధాన ఆరోపణలు
- మాజీ కార్యదర్శి అశోక్‌ను ప్రశ్నిస్తున్న అధికారులు
- ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన విజిలెన్స్ విభాగం
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం మరోసారి వార్తల్లో నిలిచింది. నాంపల్లిలోని బోర్డు కార్యాలయంలో బుధవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గంటల పాటు ఈ సోదాలు నిర్వహించడంతో సిబ్బందిలో ఆందోళన నెలకొంది.
2019 నాటి ఇంటర్ ఫలితాల వివాదానికి సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. అప్పట్లో ఫలితాల వెల్లడి బాధ్యతలను నిర్వహించిన గ్లోబరీనా టెక్నాలజీస్ సంస్థ అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలు పెను దుమారం రేపాయి. మార్కుల కేటాయింపులో జరిగిన పొరపాట్ల కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విజిలెన్స్ విభాగం విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగానే అధికారులు ఇంటర్ బోర్డు మాజీ కార్యదర్శి అశోక్‌ను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.