ఇండిగో వెబ్‌సైట్ డౌన్.. టికెట్లు బుక్ చేసుకోలేక ప్రయాణికుల అవస్థలు!
- ఇండిగో వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య
- టికెట్లు బుక్ చేసుకోలేకపోయిన ప్రయాణికులు
- ఆన్‌లైన్ చెక్-ఇన్‌లోనూ ఇబ్బందులు
- ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయని ఇండిగో
- గత డిసెంబరులోనూ ఇండిగోలో సాంకేతిక సమస్యలు
దేశీయ విమానయాన మార్కెట్లో అతిపెద్ద సంస్థ ఇండిగో వెబ్‌సైట్‌లో బుధవారం సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పలువురు ప్రయాణికులు విమాన టికెట్లు బుక్ చేసుకోలేకపోయారు.
ఢిల్లీ నుంచి పలు నగరాలకు వెళ్లేందుకు ఇండిగో వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు ఈ సమస్య ఎదురైంది. వేర్వేరు తేదీల్లో విమానాల కోసం వెతికినా అందుబాటులో ఉన్న సర్వీసుల వివరాలు కనిపించలేదని ప్రయాణికులు తెలిపారు.
మరో ట్రావెల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లోనూ ఇండిగో టికెట్ బుక్ చేసుకునే సమయంలో సాంకేతిక సమస్య ఉన్నట్లు సందేశం వచ్చింది. కొద్దిసేపటి తర్వాత మళ్లీ ప్రయత్నించాలని సూచించింది.
వెబ్‌సైట్ సమస్యపై పలువురు ప్రయాణికులు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఫిర్యాదు చేశారు. టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు ఆన్‌లైన్ చెక్-ఇన్ పూర్తి చేయడంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. విమానాల వివరాలు కనిపించకపోవడంతో తదుపరి ప్రక్రియకు వెళ్లలేకపోయామని తెలిపారు.
అయితే ఈ సాంకేతిక సమస్యకు కారణమేంటన్న దానిపై ఇండిగో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సమస్య ఎంతమందిని ప్రభావితం చేసిందన్న వివరాలు కూడా వెల్లడించలేదు.
దేశీయ విమానయాన మార్కెట్లో ఇండిగోకు 65 శాతానికి పైగా వాటా ఉంది. గత డిసెంబరులోనూ సంస్థ భారీ స్థాయిలో కార్యకలాపాల సమస్యను ఎదుర్కొంది. పైలట్ల రోస్టర్ నిర్వహణలో లోపాల కారణంగా సుమారు 4,500 విమానాలు రద్దయ్యాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తాజా ఘటనతో విమాన ప్రయాణాలకు సంబంధించిన డిజిటల్ సేవలపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. టికెట్ బుకింగ్, విమాన వివరాలు, ఆన్‌లైన్ చెక్-ఇన్ వంటి సేవలన్నీ వెబ్‌సైట్లు, యాప్‌లపై ఆధారపడుతున్న నేపథ్యంలో ఇలాంటి సాంకేతిక సమస్యలు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి.