భారీ చిత్రాలకు కొత్త రూల్.. తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు

Telangana Government issues key orders with new rules for big budget movies
  • టికెట్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవో
  • పెంచిన టికెట్ వసూళ్లలో 20% సంక్షేమానికి కేటాయింపు
  • టీజీఎఫ్‌డీసీ, సినీ కార్మికుల ఫెడరేషన్‌కు ఈ మొత్తం
  • నిర్మాతలు ఎగ్జిబిటర్ల నుంచి వసూలు చేయాలని ఆదేశం
  • 'పెద్ది', 'రాజాసాబ్' వంటి భారీ చిత్రాలకు ఈ నిబంధన వర్తింపు
భారీ బడ్జెట్ సినిమాల టికెట్ ధరల పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ ధరల పెంపు ద్వారా అదనంగా వచ్చే వసూళ్లలో 20 శాతం మొత్తాన్ని సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించాలని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎఫ్‌డీసీ)కు ఇవ్వాలని ఆదేశించింది.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. 'పెద్ది', 'రాజాసాబ్', 'మనశంకర వరప్రసాద్ గారు', 'అఖండ 2' వంటి చిత్రాలకు ఇది వర్తించనుంది. ఈ సినిమాల టికెట్ ధరల పెంపుతో వచ్చిన కలెక్షన్‌లో 20 శాతాన్ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్‌తో పాటు, టీజీఎఫ్‌డీసీ ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది.

ఈ 20 శాతం వాటాను ఎగ్జిబిటర్ల (థియేటర్ల యజమానులు) నుంచి వసూలు చేసి, సంబంధిత ఖాతాల్లో జమ చేయాల్సిన బాధ్యత నిర్మాతలపై ఉంటుందని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఇటీవల విడుదలైన భారీ చిత్రాలతో పాటు భవిష్యత్తులో రాబోయే పెద్ద సినిమాలకు కూడా ఈ నిబంధన కచ్చితంగా అమలు చేయాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయంతో సినీ పరిశ్రమలోని కార్మికుల సంక్షేమానికి ఆర్థిక భరోసా లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
Advertisement
Telangana Government
Movie ticket price hike
Big budget films
TGFDC welfare fund
Telugu film industry workers
Cinema ticket rules Telangana

More Telugu News