మండలిలో గళం బలంగా వినిపించాలి.. వర్ల రామయ్యతో మంత్రి లోకేశ్

Varla Ramaiah should raise voice strongly in Council says Nara Lokesh
  • గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన వర్ల రామయ్య
  • మంత్రి నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రామయ్య
  • ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు లోకేశ్‌కు కృతజ్ఞతలు
  • కూటమి విజయాలను మండలిలో వినిపించాలని సూచించిన మంత్రి
టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యుడిగా (ఎమ్మెల్సీ) ఎన్నికైన సందర్భంగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వర్ల రామయ్య, అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో మంత్రి లోకేశ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు మంత్రి లోకేశ్‌కు వర్ల రామయ్య ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇరువురు నేతలు కాసేపు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నారు.

అనంతరం మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ.. శాసనమండలిలో కూటమి ప్రభుత్వ విజయాలను, ప్రజా అనుకూల విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వర్ల రామయ్యకు సూచించారు. సభలో ప్రజా సమస్యలపై తమ వాణిని బలంగా వినిపించాలని కోరారు. వర్ల రామయ్య వంటి అనుభవజ్ఞుడి సేవలు మండలికి ఎంతో అవసరమని లోకేశ్‌ అభిప్రాయపడ్డారు.
Advertisement
Varla Ramaiah
Nara Lokesh
AP Legislative Council
TDP MLC
Andhra Pradesh Politics
Governor Quota MLC

More Telugu News