బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకు దక్కని చోటు.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
- తెలంగాణ బీజేపీ నేతల మధ్య వర్గపోరు ఉందన్న రాజాసింగ్
- ఢిల్లీకి వెళ్లి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకునే సంస్కృతి పెరిగిపోయిందని విమర్శ
- తెలంగాణ నేతలు మారరనే నిర్ణయానికి అధిష్ఠానం వచ్చి ఉంటుందని వ్యాఖ్య
బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నాయకులకు ప్రాతినిధ్యం దక్కకపోవడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొనసాగుతున్న వర్గ రాజకీయాలే దీనికి ప్రధాన కారణమని ఆరోపిస్తూ, రాష్ట్ర నేతలంతా తమ వైఖరిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు.
అలాగే, దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నాయకత్వంలో ప్రత్యేక ప్రణాళికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర నేతలంతా పాత విభేదాలను, స్వయం ప్రయోజనాలను పక్కనబెట్టి, పశ్చిమ బెంగాల్ తరహాలో ఐక్యంగా పోరాడి తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఐకమత్యంతో పోరాడితేనే భవిష్యత్తులో పార్టీ అధిష్ఠానం తగిన గుర్తింపునిచ్చి, పదవులు కేటాయిస్తుందని స్పష్టం చేశారు.