వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు మావే: రేవంత్‌రెడ్డి
- గీత కార్మికులకు పింఛన్లు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటన
- వారి కోసం ప్రభుత్వ భూముల్లో ఈత, తాటి చెట్ల పెంచుతామన్న సీఎం
- కేసీఆర్ సర్కార్ పిల్లల చదువులను విస్మరించిందని విమర్శలు
- హరీశ్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారన్న ముఖ్యమంత్రి
తెలంగాణలోని గీత కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ గీత కార్మికుడికి పింఛను అందిస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జరిగిన సభలో ఆయన ఈ ప్రకటన చేశారు.
గీత కార్మికుల జీవనోపాధిని కాపాడటం తమ ప్రభుత్వ బాధ్యత అని సీఎం స్పష్టం చేశారు. వారి ఉపాధిని పెంచేందుకు ప్రభుత్వ భూములు, కాలువ గట్ల వెంబడి ఈత, తాటి చెట్లను విరివిగా పెంచుతామని తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పటికే రూ. 5 లక్షల పరిహారం అందిస్తోందని గుర్తుచేశారు.
ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రభుత్వం గేదెలు, గొర్రెల పెంపకం వంటి కులవృత్తులను ప్రోత్సహించినట్టే చేసి, వారి పిల్లల చదువులను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. తమ ఇందిరమ్మ పాలనలో బహుజనుల పిల్లలు చదువుకుని డాక్టర్లు, లాయర్లు, ఐఏఎస్ అధికారులు కావాలని ప్రోత్సహిస్తున్నామని, ఇదే నిజమైన సామాజిక న్యాయమని పేర్కొన్నారు. కేసీఆర్ చేసింది కుటుంబ న్యాయం అయితే, తాను చేస్తోంది సామాజిక న్యాయం అని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రానికి కరవు రావాలని, రైతులు నష్టపోవాలని హరీశ్ రావు కర్ణాటక, తమిళనాడు వెళ్లి క్షుద్ర పూజలు చేస్తున్నారని విమర్శించారు. "క్షుద్ర పూజలు చేసే వారిని చెట్లకు కట్టేసి కొట్టాలి" అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 117 సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ, గౌడ కులస్తులు తమకు పూర్తి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.