చెన్నై వెళుతున్న చంద్రబాబు.. షెడ్యూల్ ఖరారు
- రేపు సాయంత్రం విజయవాడ నుంచి చెన్నై వెళుతున్న చంద్రబాబు
- రెండు రోజుల పాటు చెన్నైలో సీఎం పర్యటన
- సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల చెన్నై పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపు, ఎల్లుండి ఆయన తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటించనున్నారు. రేపు (ఆగస్టు 19) సాయంత్రం 5.30 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై బయలుదేరి వెళ్లనున్న సీఎం, రాత్రి చెన్నైలోని తాజ్ ఫిషర్‌మ్యాన్స్ కోవ్ రిసార్ట్‌లో బస చేయనున్నారు.
పర్యటనలో భాగంగా ఎల్లుండి (ఆగస్టు 20) ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించనున్న 31వ ‘సదరన్ జోనల్ కౌన్సిల్’ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. దక్షిణ భారత రాష్ట్రాల మధ్య ఉన్న పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. సమావేశం ముగిసిన అనంతరం అదే రోజు సాయంత్రం 5.15 గంటలకు చంద్రబాబు అమరావతిలోని తన ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.