పండగల వేళ వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన స్మార్ట్‌ఫోన్ల ధరలు
- వివిధ స్మార్ట్‌ఫోన్ల ధరలు రూ. 10,000 వరకు పెంపు
- మెమరీ చిప్‌ల ధరల పెరుగుదలే కారణమంటున్న కంపెనీలు
- వన్‌ప్లస్, ఐకూ, రెడ్‌మీ, పోకో వంటి బ్రాండ్ల ధరల సవరణ
- ధరల పెరుగుదలతో తగ్గుతున్న స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు
పండగ సీజన్‌లో రాయితీల కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు గట్టి షాక్ ఇచ్చాయి. తమ ఫోన్ల ధరలను మరోమారు భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పలు మోడళ్లపై రూ. 2,000 నుంచి ఏకంగా రూ. 10,000 వరకు ధరలను పెంచడం ద్వారా కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి తీవ్ర నిరాశ మిగిల్చాయి.
వన్‌ప్లస్, పోకో, రెడ్‌మీ, ఐకూ వంటి ప్రముఖ బ్రాండ్లు తమ ఫోన్ల ధరలను సవరించాయి. వన్‌ప్లస్ తన నార్డ్ 6 సిరీస్ ఫోన్లపై రూ. 4,000 వరకు ధరను పెంచగా, ఐకూ 15 మోడల్‌పై గరిష్ఠంగా రూ. 8,000, ఐకూ 15ఆర్ మోడల్‌పై రూ. 5,000 వరకు పెంచింది. పోకో ఎక్స్8 ప్రో, ప్రో మ్యాక్స్ వేరియంట్లపై రూ. 5,000, రెడ్‌మీ టర్బో 5పై రూ. 5,000 మేర ధరలు పెరిగాయి. ఒప్పో, వివో కంపెనీలు సైతం తమ పలు మోడళ్ల ధరలను రూ. 4,000 నుండి రూ. 5,000 వరకు పెంచాయి.
పారిశ్రామిక నివేదికల ప్రకారం, మెమరీ చిప్‌ల ధరలు పెరగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా డీ-ర్యామ్, నాండ్ ఫ్లాష్ మెమరీ చిప్‌లకు తీవ్ర కొరత ఏర్పడింది. ముఖ్యంగా ఏఐ డేటా సెంటర్ల నుంచి డిమాండ్ పెరగడంతో వీటి ధరలు ఆకాశాన్నంటాయి. ఫలితంగా ఫోన్ల తయారీ వ్యయంలో మెమరీ చిప్‌ల వాటా గణనీయంగా పెరిగిందని, ఆ అదనపు భారాన్ని వినియోగదారులపై మోపక తప్పడం లేదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.