8 లక్షల డ్రైవర్లు.. 41 లక్షల కస్టమర్లు.. 'భారత్ ట్యాక్సీ' సంచలనం!
- భారత్ ట్యాక్సీలో 8 లక్షల మంది డ్రైవర్లు
- కస్టమర్ల సంఖ్య 41 లక్షలకు
- 2029 నాటికి దేశవ్యాప్త విస్తరణ లక్ష్యం
- జీరో కమిషన్ విధానంలో డ్రైవర్లకు ప్రయోజనం
- త్వరలో మరో ఏడు నగరాల్లో సేవలు
దేశంలో క్యాబ్ సేవల రంగంలో కొత్త వేదిక వేగంగా విస్తరిస్తోంది. సహకార సంస్థల ఆధారంగా పనిచేస్తున్న 'భారత్ ట్యాక్సీ'కి భారీ స్పందన లభిస్తోంది. జులై 25 నాటికి ఈ ప్లాట్‌ఫామ్‌లో దాదాపు 8 లక్షల మంది డ్రైవర్లు చేరారు. కస్టమర్ల సంఖ్య 41 లక్షలకు చేరింది. 2029 నాటికి దేశవ్యాప్తంగా సేవలు అందించడమే లక్ష్యంగా భారత్ ట్యాక్సీ ముందుకు సాగుతోంది.
మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్-2002 కింద భారత్ ట్యాక్సీ ఏర్పాటైంది. నాబార్డ్, ఇఫ్కో, అమూల్, నాఫెడ్, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సహా ఎనిమిది జాతీయ సహకార సంస్థలు దీన్ని ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్‌సీఆర్, గుజరాత్, ముంబయి, లఖ్‌నవూ, చండీగఢ్, జైపూర్, కాన్పూర్, పుణేలో సేవలు అందిస్తోంది.
త్వరలో మరిన్ని నగరాలకు భారత్ ట్యాక్సీ విస్తరించనుంది. రాంచీ, పాట్నా, గువాహటి, భోపాల్, కోల్‌కతా, ఇండోర్, నాగ్‌పూర్‌లో సేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దశలవారీగా దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
భారత్ ట్యాక్సీ ప్రత్యేకత జీరో కమిషన్ విధానం. డ్రైవర్లను ‘సారథులు’గా పిలుస్తున్నారు. ప్రయాణికుల నుంచి వచ్చిన చార్జీలో ప్లాట్‌ఫామ్‌కు కమిషన్ చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో డ్రైవర్లు తమ ఆదాయాన్ని పూర్తిగా పొందే అవకాశం ఉంటుంది. సారథులు సహకార సంస్థలో వాటాలు కొనుగోలు చేసి సభ్య యజమానులుగా మారొచ్చు. సంస్థ నిర్వహణలోనూ వారికి ప్రాతినిధ్యం ఉంటుంది.
బైక్ ట్యాక్సీలు, ఆటోలు, ఎకానమీ క్యాబ్‌లు, ప్రీమియం సెడాన్లు, ఎస్‌యూవీలు, రెంటల్స్, అవుట్‌స్టేషన్ ప్రయాణాలు, ముందస్తు బుకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ధరల్లో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ తెలిపింది. సర్జ్ ప్రైసింగ్, అదనపు ప్లాట్‌ఫామ్ ఛార్జీలు ఉండవని పేర్కొంది.
మహిళల కోసం ‘సారథి దీదీ’ సేవను కూడా తీసుకొచ్చింది. దీని ద్వారా మహిళా ప్రయాణికులు మహిళా డ్రైవర్లను ఎంచుకోవచ్చు. మహిళలు డ్రైవింగ్ రంగంలోకి రావడానికి ‘బైక్ దీదీ’ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. డ్రైవర్లను ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేయడంతో సామాజిక భద్రతా ప్రయోజనాలు పొందే అవకాశం కల్పిస్తున్నారు. ప్రమాద, ఆరోగ్య బీమా సదుపాయాలను కూడా భాగస్వామ్య సంస్థల ద్వారా అందిస్తున్నారు.