శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక... నవంబర్ నెల సేవా టికెట్ల షెడ్యూల్ విడుదల
- ఆగస్టు 18న సుప్రభాతం, తోమాల, అర్చన సేవల ఎలక్ట్రానిక్ డిప్ ప్రారంభం
- ఆగస్టు 21న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, వర్చువల్ సేవల టికెట్లు
- ఆగస్టు 25న ప్రత్యేక ప్రవేశ దర్శనం, గదుల కోటా అందుబాటులోకి
- అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచన
2026 నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, దర్శన టోకెన్లు, వసతి గదుల ఆన్‌లైన్ కోటా విడుదల షెడ్యూల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. భక్తులు ఈ తేదీలను గమనించి, టిక్కెట్లను ముందస్తుగా బుక్ చేసుకోవాలని సూచించింది.
భారీ డిమాండ్ ఉండే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి ఆర్జిత సేవల కోసం ఎలక్ట్రానిక్ డిప్ (లక్కీ డిప్) విధానంలో టికెట్లను కేటాయించనున్నారు. ఇందుకోసం భక్తులు ఆగస్టు 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో పేర్లను నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో టిక్కెట్లు పొందిన భక్తులు ఆగస్టు 22వ తేదీ మధ్యాహ్నంలోగా నిర్ణీత రుసుము చెల్లించి తమ టిక్కెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇతర సేవా టికెట్లను ఆగస్టు 21న విడుదల చేయనున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టిక్కెట్లు అందుబాటులోకి వస్తాయి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటాను టీటీడీ విడుదల చేస్తుంది.
ఆగస్టు 24న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టిక్కెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను విడుదల చేస్తారు.
ఇక ఆగస్టు 25న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని వసతి గదుల బుకింగ్ కోటాను అందుబాటులో ఉంచుతారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.