జూమ్ కాల్‌లో 900 మందిని తొలగించిన భారత సీఈవోకు షాక్.. కంపెనీ నుంచి ఉద్వాసన!
- జూమ్ కాల్‌లో 900 మందిని తొలగించి వివాదాస్పదమైన విశాల్ గార్గ్
- సొంత కంపెనీ బెటర్.కామ్ సీఈవో పదవి నుంచే ఆయనకు ఉద్వాసన
- కొత్త సీఈవో తనను మోసం చేశారంటూ ఆరోపణలు, తిరిగి పదవి కోసం పోరాటం
- కంపెనీ లాభాల్లోకి వచ్చేవరకూ ఏడాదికి ఒక్క డాలర్ జీతానికే పనిచేస్తానని ఆఫర్
- ప్రముఖ న్యాయవాదిని నియమించుకుని బోర్డుపై న్యాయపోరాటానికి సిద్ధం
ఒకే జూమ్ కాల్‌లో 900 మందికి పైగా ఉద్యోగులను తొలగించి 2021లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారత సంతతి వ్యాపారవేత్త విశాల్ గార్గ్, ఇప్పుడు తన సొంత కంపెనీ నుంచే ఉద్వాసనకు గురయ్యారు. తనను మోసపూరితంగా తొలగించారని ఆరోపిస్తూ, 'బెటర్ హోమ్ అండ్ ఫైనాన్స్' కంపెనీ సీఈవో పదవిని తిరిగి దక్కించుకోవడానికి ఆయన న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు.
వివరాల్లోకి వెళితే, ఆగస్టు 3న బెటర్.కామ్ బోర్డు విశాల్ గార్గ్‌ను సీఈఓ పదవి నుంచి తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో, కేవలం వారం రోజుల క్రితం (జులై 27న) బోర్డులో చేరిన హెడ్జ్ ఫండ్ మేనేజర్ డేనియల్ లూయిస్‌ను తాత్కాలిక సీఈఓగా నియమించింది. మొదట ఈ మార్పు ఇరువర్గాల అంగీకారంతోనే జరిగిందని కంపెనీ ప్రకటించినా, ఆ తర్వాత అసలు విషయం బయటపెట్టింది. గార్గ్ నిర్ణయాలు తీసుకునే తీరు, ఆయన ప్రవర్తన, విశ్వసనీయతపై ఉన్న ఆందోళనల కారణంగానే ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.
ఈ నిర్ణయంపై విశాల్ గార్గ్ తీవ్ర ఆరోపణలు చేశారు. "లూయిస్ నన్ను మోసం చేశారు. కంపెనీ వ్యూహాలు నచ్చాయని సోషల్ మీడియాలో మమ్మల్ని ప్రశంసించి, మా నమ్మకాన్ని చూరగొని బోర్డులోకి ప్రవేశించారు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఈవో పదవిని దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే లూయిస్ ఇదంతా చేశారని గార్గ్ ఆరోపించారు.
కంపెనీ ఆర్థికంగా కోలుకుని, లాభాల బాట పడుతున్న కీలక సమయంలో తనను తొలగించడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. 2021లో 1.5 బిలియన్ డాలర్ల అమ్మకాలు ఉండగా, వడ్డీ రేట్లు పెరుగుదల కారణంగా 2023 నాటికి అది 70 మిలియన్ డాలర్లకు పడిపోయిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఏఐ సాంకేతికత, కొత్త భాగస్వామ్యాలతో కంపెనీ రుణాల జారీ మూడు రెట్లు పెరిగి, లాభాలకు చేరువవుతున్న తరుణంలో తనను తప్పించారని వాపోయారు.
ప్రస్తుతం బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్న గార్గ్, తిరిగి సీఈవో పదవిని చేపట్టేందుకు అవసరమైన ఓటింగ్ బలం తనకు ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికోసం ప్రముఖ న్యాయవాది అలెక్స్ స్పిరోను ఆయన నియమించుకున్నారు. కంపెనీ తిరిగి లాభాల్లోకి వచ్చే వరకు ఏడాదికి కేవలం 1 డాలర్ జీతానికే పనిచేస్తానని, ఆ తర్వాత తానే తప్పుకుంటానని ఆయన బోర్డుకు ప్రతిపాదించారు. ఈ వివాదం త్వరగా పరిష్కారమవుతుందని, కంపెనీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని గార్గ్ ఆశాభావం వ్యక్తం చేశారు.