జగన్ కేసులపై సుప్రీంకోర్టు ప్రత్యేక దృష్టి సారించాలి: జ్యోతుల నెహ్రూ

Jyothula Nehru demands Supreme Court focus on YS Jagan Mohan Reddy cases
  • జగన్ బెయిల్ రద్దు చేయాలన్న జ్యోతుల నెహ్రూ
  • పరామర్శల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపాటు
  • ఈ తరహా వైఖరిపై కోర్టులు కఠిన చర్యలు తీసుకోవాలని వినతి

వైసీపీ అధినేత జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. జగన్‌కు సంబంధించిన కేసులపై దేశ అత్యున్నత నాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


రాష్ట్రంలో వైసీపీ నాయకులు వరుసగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని మండిపడిన జ్యోతుల నెహ్రూ, ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో జగన్ బెయిల్‌ను ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించారు. బాధితులకు పరామర్శల పేరుతో జగన్ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తూ, శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ తరహా వైఖరిపై న్యాయస్థానాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement
Jyothula Nehru
YS Jagan Mohan Reddy
Supreme Court
Jagan Bail Cancellation
TDP MLA
Andhra Pradesh Politics

More Telugu News