సీఎం విజయ్ తల్లిపై నైనార్ నాగేంద్రన్ వివాదాస్పద వ్యాఖ్యలు.. తీవ్రంగా ఖండించిన టీవీకే, అన్నామలై

Nainar Nagendran controversial comments on Vijay mother TVK and Annamalai condemn
  • ఉదయనిధిని ఉద్దేశించి మీ తండ్రి ఎక్కడ అని ప్రశ్నించిన విజయ్
  • ఇంట్లో ఉన్న తల్లిని అడిగితే తెలుస్తుందన్న నాగేంద్రన్
  • సీఎం తల్లిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను అంగీకరించలేమన్న అన్నామలై

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తల్లిని ఉద్దేశించి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశించి "మీ నాన్న ఎక్కడ?" అంటూ అసెంబ్లీలో విజయ్ చేసిన విమర్శలపై స్పందిస్తూ నైనార్ నాగేంద్రన్ ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారు.


అసెంబ్లీలో 'తండ్రి' కోసం వెతకడం కాకుండా, ఇంట్లో ఉన్న తల్లిని అడిగితేనే తండ్రి ఎవరో తెలుస్తుందంటూ నాగేంద్రన్ వ్యాఖ్యానించారు. ఈ తరహా వ్యాఖ్యలపై టీవీకే వర్గాలు తీవ్రంగా మండిపడ్డాయి. నైనార్ నాగేంద్రన్ ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా కాకుండా వీధి చివర మాట్లాడే వ్యక్తిలా మాట్లాడారని విద్యాశాఖ మంత్రి రాజమోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తన పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడుకుంటూ మాట్లాడాలని హితవు పలికారు.


ఈ వివాదంపై బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కూడా తీవ్రంగా స్పందించారు. నైనార్ నాగేంద్రన్ రాజకీయ సంస్కృతి, ఎల్లలను దాటి మాట్లాడారని ఆయన ఖండించారు. తమిళనాడు రాజకీయాన్ని ఈ స్థాయిలో దిగజార్చడం అత్యంత విచారకరమని, విజయ్ తల్లిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఎంతమాత్రం అంగీకరించలేమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. విధానపరమైన వ్యత్యాసాలు, ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేయడం సహజమే అయినప్పటికీ... కుటుంబ సభ్యులను, ముఖ్యంగా తల్లిని లాగి మాట్లాడడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.

Advertisement
Nainar Nagendran
Thalapathy Vijay
Annamalai
TVK party
Tamil Nadu politics
Controversial comments

More Telugu News