లోక్ భవన్‌లో గవర్నర్ 'ఎట్ హోం'.. సతీసమేతంగా హాజరైన సీఎం చంద్రబాబు
- స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లోక్ భవన్‌లో 'ఎట్ హోం'
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో తేనీటి విందు
- ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు
- పాల్గొన్న మంత్రులు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు
- గవర్నర్, ముఖ్యమంత్రి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు
భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ విజయవాడలోని లోక్ భవన్‌లో 'ఎట్ హోం' కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులను గవర్నర్ అబ్దుల్ నజీర్, ఆయన అర్ధాంగి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గవర్నర్, ముఖ్యమంత్రి ఇరువురూ ఒకరికొకరు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
అనంతరం గవర్నర్ దంపతులు ఆహ్వానితులకు తేనీటి విందు ఇచ్చారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వయంగా ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, సైనిక అధికారులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖుల రాకతో లోక్ భవన్ ప్రాంగణం పండుగ వాతావరణంలో సందడిగా మారింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమం కొనసాగింది.
అనారోగ్యం కారణంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కాకినాడలో ఇవాళ స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్ లో పాల్గొన్న అనంతరం పవన్ తీవ్ర జ్వరంతో బాధపడుతుండడంతో, ఆయన ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొనడంలేదని జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. రాజమండ్రిలో వైద్య పరీక్షల అనంతరం పవన్ కల్యాణ్ హైదరాబాద్ వెళ్లిపోయారు.